స్పైస్ ఫైర్‌ఫాక్స్ ఫోన్@రూ.2,299

Posted By:

మొజిల్లా సంస్థ భాగస్వామ్యంతో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ మొబిలిటీ, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 పేరుతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ కాన్ఫిగరేషన్, 3.5 అంగుళాల తాకే తెర, 1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్ తదితర ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,299.

స్పైస్ ఫైర్‌ఫాక్స్ ఫోన్@రూ.2,299

స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 (Spice Fire One Mi- FX1) కీలక ఫీచర్లు:

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 320పిక్సల్స్),
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ మొబైల్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్).

ప్రస్తుతం స్పైస్ ఫైర్ వన్ ఎమ్ఐ-ఎఫ్ఎక్స్1 స్మార్ట్ ఫోన్ ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting