ఆ ‘తైవాన్’ బ్రాండ్ గుట్టు రట్టు..?

Posted By: Staff

ఆ ‘తైవాన్’ బ్రాండ్ గుట్టు రట్టు..?

 

తైవాన్ లైసెన్స్‌డ్  గ్లోబల్ మొబైల్ ఉత్పత్తిదారు ‘మైక్రో‌వేవ్ యాక్సిస్ సర్వీస్’ (microwave access service) తన తాజా ఆవిష్కరణకు సంబంధించిన  సమాచారాన్ని బహిర్గతం చేసింది.  ఈ బ్రాండ్ ‘7G Miracle’ మోడల్‌లో 3జీ మరియు 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే డ్యూయల్  మోడ్ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది.

ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

*   మీడియాటెక్ చిప్‌సెట్ వ్యవస్థ,

* AU optronics డిస్‌ప్లే ప్యానల్,

*  ఆండ్రాయిడ్ 2.3 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,

*  4.1 అంగుళాల మల్టీ‌‌‌టచ్‌ స్ర్కీన్,

*  ఓపెన్ జీఎల్  3డి గ్రాఫిక్ యాక్సిలరేటర్,

ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ సందర్భంగా ‘గ్లోబల్ మొబైల్స్ ఛైర్ పర్సన్’ రోజ్ మేరీ స్పందిస్తూ ‘7G Miracle’ డ్యూయల్ మోడ్ స్మార్ట్ ఫోన్ల విడుదలతో పాటు 4జి నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే 1000 ప్రత్యేక ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 2012 ఆర్ధిక సంవత్సంలో 2,50,000 వినియోగదారులకు చేరువకావటమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు మేరీ తెలిపారు. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న ‘7జి మిరాకిల్’ డ్యూయల్ మోడ్ స్మార్ట్‌ఫోన్ ధర మరియు ఇతర ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting