గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌లోని 5 ఆసక్తికర ఫీచర్లు

Posted By: BOMMU SIVANJANEYULU

సామ్‌సంగ్ సంచలన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన గెలాక్సీ ఎస్9 కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఆర్ ఎమోజీ, బిక్స్‌బీ విజన్ వంటి బ్రాండ్ న్యూ ఫీచర్లను సామ్‌సంగ్ పొందుపరిచింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే సెటప్ చేసుకోవల్సిన 5 ముఖ్యమైన ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఫేషియల్ రికగ్నిషన్ సెటప్
సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటిలిజెంట్ స్కాన్ సిస్టం పేరుతో ప్రత్యేకమైన ప్రొటెక్షన్ టెక్నాలజీని నిక్షిప్తం చేసింది. ఫేస్‌ రికగ్నిషన్ అలానే ఐరిస్ స్కాన్ టెక్నాలజీల కలయకతో స్పందించగలిగే ఈ టెక్నాలజీ ఫోన్ సెక్యూరిటీని కొత్త స్టాండర్డ్స్‌కు తీసుకువెళుతుంది. యూజర్ తన ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకునే క్రమంలో ఐరిస్ అలానే ఫేస్ ఐడీని వెరిఫై చేసుకోవల్సి ఉంటుంది. ఈ రెండు సింక్ అయినపుడు మాత్రమే ఫోన్ అన్‌లాక్ కాబడుతుంది. కాబట్టి గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌ను మీరు కొనుగోలు చేసిన వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను సెటప్ చేసుకునే క్రమంలో యూజర్ ఫోన సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి లాక్ స్ర్కీన్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫోన్ కెమెరా సహాయంతో ఫేస్ ఇంకా ఐరిస్ డేటాను సెటప్ చేసుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏఆర్ ఎమోజీ ఫీచర్

గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి నూతనంగా యాడ్ కాబడిన ఫీచర్లలో ఏఆర్ ఎమోజీ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా వర్చువల్ త్రీ-డైమెన్షనల్ అవతార్‌లను యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు. 3డీ విజువల్ అవతార్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి ఏఆర్ ఎమోజీ ఆప్షన్ పై స్వైప్ చేసి క్రియేట్ మై ఎమోజీ బటన్ పై ప్రెస్ చేసినట్లయితే మీకు సంబంధించిన వర్చువల్ అవతార్ జనరేట్ కాబడుతుంది. జనరేట్ అయిన 3డీ అవతార్ ని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేుసుకునే వీలుంటుంది.

ఆల్వేస్ ఆన్ నోటిఫికేషన్..

నోటిఫికేషన్‌లను చెక్ చేసుకునేందుకు ప్రతిసారి ఫోన్‌ను అన్‌లాక్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ అనేది ఖర్చయిపోతుంటుంది. ఇలా కాకుండా ఫోన్‌లోని ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫోన్ లాక్ అయి ఉన్నప్పటికి నోటిఫికేషన్స్ అన్ని స్ర్కీన్ పై కనపిస్తాయి. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే బటన్‌ను సెలక్ట్ చేసుకుని ON బటన్ పై ప్రెస్ చేసినట్లయితే ఫీచర్ యాక్టివేట్ కాబడుతుంది.

 

 

బిక్స్‌బై ఫీచర్‌ను ట్రై చేయండి..

సామ్‌సంగ్ లేటెస్ట్ ఇన్నోవేషన్స్‌లో బిక్స్‌బై ఒకటి. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఏ విషయాన్ని అయినా రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేయగలుగుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ఫోన్ కెమెరాను ఓపెన్ చేసి ఎడమ చేతి వైపు కనిపించే eye ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే సామ్‌సంగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను ఓకే చేసి అకౌంట్‌లోకి సైనిన్ అయినట్లయితే బిక్స్‌బై ఫీచర్ పని చేయటం ప్రారంభిస్తుంది.

స్ర్కీన్ రిసల్యూషన్‌ను అడ్జస్ట్ చేసుకోండి..

గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్ రిసల్యూషన్‌ను అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. రిసల్యూషన్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా ఆదా చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Are The First 5 Things To Do With Your Samsung Galaxy S9. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot