నోకియా లూమియా 900.. ‘త్వరలో’!!!

Posted By: Prashanth

నోకియా లూమియా 900.. ‘త్వరలో’!!!

 

నోకియా లూమియా సిరీస్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్లు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అమ్మకాల విషయంలో ఈ ఫోన్లు రికార్డులు సృష్టించాయి. ఈ సిరీస్ లో విడుదల కాబోతున్న ‘లూమియా 900’ పై భారి అంచనాలు నెలకున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శాసించే క్రమంలో ‘లూమియా 900’లో ఆడ్వాన్సడ్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.

క్లుప్తంగా ఫీచర్లు:

- 4.3 అంగుళాల AMOLED డిస్ ప్లే,

- 1.4 GHz ప్రాసెసర్,

- నోకియాస్ మైక్రో యూఎస్బీ ఫోర్ట్,

- ఐఫోన్ స్టైల్ పిన్ పుష్ యాక్సిస్,

- విండోస్ ఫోన్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

- 8 మెగా పిక్సల్ కెమెరా,

- హై డెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్ రికార్డింగ్,

- ఇమేజ్ సెన్సార్,

- 16జీబి ఇంటర్నల్ మెమరి.

2012 ప్రధమాంకంలో విడుదల కాబోతున్న లూమియా 900 పై మార్కెట్ అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ‘లూమియా 900’ ఆపిల్ డివైజులకు పోటిగా నిలుస్తుందన్న రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot