గూగుల్ తయారు చేసిన పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయ్..?

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, తన సరికొత్త పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లతో హార్డ్‌వేర్ విభాగంలో అడుగుపెట్టింది. Pixel, Pixel XL మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ గూగుల్ ఫోన్‌లు యాపిల్, సామ్‌సంగ్ ఫ్లాగ్ షిప్‌ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలిచాయి.

గూగుల్ తయారు చేసిన పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయ్..?

Read More : హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 20 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సరికొత్త డిజైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెచీన్ లెర్నింగ్ వంటి ఆధునిక అంశాలతో గూగుల్ దగ్గరుండి అభివృద్థి చేయించుకున్న ఈ ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇఫ్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తయారీ కాంట్రాక్ట్‌ హెచ్‌టీసీ దక్కించుకుంది

గూగుల్ పిక్సల్ ఫోన్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను హెచ్‌టీసీ దక్కించుకుంది. ఈ ఫోన్‌లకు సంబంధించి హార్ట్‌వేర్ దగ్గర నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్ని విభాగాలను గూగుల్ దగ్గరుండి చూసుకుంది. ఈ ఫోన్‌ల పై ఎక్కడా హెచ్‌టీసీ లోగో కనిపించదు.

మెటల్ ఇంకా గ్లాస్ కాంభినేషన్‌లో

గూగుల్ Pixel ఫోన్ 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోండగా, Pixel XL ఫోన్ 5.5 హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. గొరిల్లా గ్లాస్ 4 కోటింగ్ ఈ ఫోన్ డిస్‌ప్లేలకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆల్యూమినియమ్ మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో రూపొందించడని ప్రత్యేకమైన ఫ్రేమ్‌లను ఈ ఫోన్‌ల వెనుక భాగంలో అమర్చారు.

లెటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం అయిన 7.1 Nougat పై రన్ అవుతాయి.

శక్తివంతమైన ప్రాసెసర్..

2.15గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 821 64-బిట్ క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌లను ఈ రెండు ఫోన్‌లలో నిక్షిప్తం చేసారు.

ర్యామ్ ఇంకా స్టోరేజ్..

4జీబి ర్యామ్‌ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లు 32జబి అలానే 128జీబి స్టోరేజ్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటాయి.

కెమెరా విభాగాలను పరిశీలించినట్లయితే..

ఈ రెండు ఫోన్‌లలో కెమెరా విభాగాలను పరిశీలించినట్లయితే.. 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

ఈ రెండు ఫోన్‌లలో ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ వెనుక భాగంలో వీటిని ప్లేస్ చేయటం జరిగింది.

మూడు కలర్ వేరియంట్స్..

బ్లాక్, సిల్వర్ ఇంకా బ్లు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో..

ఇండియన్ మార్కెట్లో గూగుల్ పిక్సల్ ఫోన్‌లు ధరలు రూ.57,000 దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఆఫ్ లైన్ మార్కెట్లోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉంటాయి.

24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌

ఈ ఫోన్‌లకు 24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌ను గూగుల్ కల్పిస్తుంది. ఫోన్‌లో తలెత్తిన సమస్యలను అప్పటికప్పుడు గూగుల్ టెక్నీషియన్స్ మీ ఫోన్ స్ర్కీన్‌ను షేర్ చేసుకుని లైవ్‌లో సమస్యలను పరిష్కరిస్తారు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వాటంతటకవే...

పిక్సల్ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వాటంతటకవే ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌ల పై గూగుల్ సరికొత్త సర్వీసెస్‌ను ఆఫర్ చేస్తోంది.

స్టోరేజ్ సమస్యలను అధిగమించేందుకు..

స్టోరేజ్ సమస్యలను అధిగమించేందుకు enhanced ఫోటోస్ క్లౌడ్ సపోర్ట్‌ను ఈ డివైసెస్‌లో కల్పిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కెమెరాలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు గూగుల్ చెబుతోంది. ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ DxoMarks పిక్సల్ ఫోన్ కమెరాకు 89 స్కోర్ ఇవ్వటం విశేషం.

సింపుల్ ఇంకా స్మార్ట్‌

సింపుల్ ఇంకా స్మార్ట్‌గా డిజైన్ కాబడిన గూగుల్ పిక్సల్ ఫోన్‌లు విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ డేడ్రీమ్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
First Google-made smartphones Pixel and Pixel XL, Interesting things to know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot