బ్లాక్‌బెర్రీ మిలాన్ ఫస్ట్‌లుక్ అవుట్!!

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ మిలాన్ ఫస్ట్‌లుక్ అవుట్!!

 

సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే ఏడాది విడుదలకాబోతున్న ‘బ్లాక్ బెర్రీ మిలాన్’ (Blackberry Milan) తొలి ఇమేజ్ బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. ఈ స్మోర్ట్ ఫోన్‌పై ఇప్పటికే అంచనాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ‘బ్లాక్ బెర్రీ 10’ వర్షన్‌‌లో డిజైన్ కాబడిన ఈ ఆపరేటింగ్ సిస్టం వివిధ ఫీచర్లు, మొబైల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌లతో లోడ్ కాబడి ఉంది. ఈ కొత్త ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్‌తో పనిచేసే విధంగా మరో 5 మోడళ్లను రిమ్ డిజైన్ చేస్తునట్లు తెలుస్తోంది. 2012లో వీటి విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

 బ్లాక్ బెర్రీ మిలాన్ ఫీచర్లు:

-‘బ్లాక్ బెర్రీ 10’ ఆపరేటంగ్ సిస్టం,

- స్లైడర్ డిజైన్,

- క్వర్టీ కీప్యాడ్,

- పెద్దదైన డిస్‌ప్లే,

- హై పిక్సల్ డెన్సిటీ,

- హైయిర్ డిస్‌ప్లే క్వాలిటీ,

- కర్వుడ్ ఎడ్జ్‌స్,

- ధర ఇతర స్సెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot