Home
Mobile

Oppo Reno10 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకొనే టెలిఫోటో కెమెరా.. అబ్బురపరిచే పనితీరు

oppo reno10 pro plus 5g

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఒప్పో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. రెనో సిరీస్‌ ఇందుకు మంచి ఉదాహరణ. తాజాగా విడుదలైన OPPO Reno10 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు తొలిసారిగా టెలిఫోటో పోర్ట్రెయిట్‌ కెమెరాను కలిగి ఉన్నాయి. దీంతోపాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

ఒప్పో రెనో 10 సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ అయిన OPPO Reno10 Pro+ 5G.. స్మార్ట్‌ఫోన్ల రంగంలోనే అత్యధిక మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ల కంటే రెనో సిరీస్‌ ఫోన్లు తొలిసారిగా అత్యాధునిక ఇమేజింగ్‌ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

ఈ ఒప్పో రెనో 10 ఫ్లాగ్‌షిప్ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ సన్నని, తేలికైన పెరిస్కోప్‌ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటుంది. కెమెరా ఫీచర్లు సహా రెనో10 ప్రో + 5G స్మా్ర్ట్‌ఫోన్‌లో ఉన్న అనేక మెరుగైన, నాణ్యమైన ఫీచర్లు ఉన్నాయి. కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

oppo reno10 pro plus 5g

ఆల్ట్రా క్లియర్‌ పోర్ట్రెయిట్‌ కెమెరా సిస్టమ్‌ : రెనో10 సిరీస్‌ ప్రధానంగా ఫోటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరచడం, మెరుగైన ఇమేజింగ్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌తో కంటెంట్‌ క్రియేటర్లకు ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్లలో తొలిసారిగా టెలిఫోటో పోర్ట్రెయిట్‌ కెమెరాను అమర్చారు. 64MP టెలిఫోటో పోర్ట్రెయిట్‌ కెమెరాతో కంటెంట్‌ క్రియేటర్లు 3X ఆప్టికల్‌ జూమ్‌ వరకు ఫోటోలను తీసుకోగలరు. 1/2 అంగుళాల సెన్సార్‌ ప్రతికూలమైన వెలుగులోనూ మెరుగైన ఫోటోలను అందిస్తుంది.

ఈ టెలిఫోటో కెమెరా 25cm కనిష్ఠ దూరంతో భారీ f/2.5 అపేచర్‌తో వస్తుంది. మరియు సహజమైన బోకే షాట్‌లను అందిస్తుంది. రెనో10 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రధాన కెమెరాతోపాటు భారీ 1/1.56 అంగుళాల సోనీ IMX890 సెన్సార్‌తోపాటు f/1.8 అపేచర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు OIS, పిక్సల్‌ ఓమ్నీ డైరెక్షన్‌ PDAFతో ఆల్ట్రా క్లియర్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

దీంతోపాటు 112 డిగ్రీల ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 5P లెన్స్‌ మాడ్యూల్ మరియు 1.12um పిక్సెల్‌లు కూడా ఉన్నాయి. ఇవి వైడ్‌ ఫీల్డ్‌ వీక్షణను అత్యంత నాణ్యంగా అందిస్తాయి. ఈ కెమెరా యాంటీ ఫేషియల్‌ డిస్టార్షన్‌ అల్గారిథమ్‌ను కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో10 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సోనీ IMX709 సెన్సార్‌ సహా RGBW పిక్సల్‌ అరేతో వస్తుంది. లైట్‌ క్యాప్చర్‌, ఇమేజ్‌ క్వాలిటీ సహా తక్కువ కాంతిలోనూ మైరుగైన పనితీరు కోసం ఈ కెమెరాను ఒప్పో, సోనీ కలిసి రూపొందించాయి. 15cm దూరంలో ఆటో ఫోకస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

oppo reno10 pro plus 5g

3D కర్వడ్‌ OLED డిస్‌ప్లే : ఒప్పో రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ 10 బిట్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌రేట్‌తో వస్తుంది. 2772*1240 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10+ను సపోర్టు చేస్తుంది. మరియు ఈ ఫోన్‌ అప్‌గ్రేడ్‌ చేసిన డ్యూయల్‌ ట్రాక్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌లో హై-బ్రైట్‌నెస్‌ మోడ్‌లో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ 1100 nits వరకు వెళ్లవచ్చు. HRD కంటెంట్‌ ప్లే చేస్తున్న సమయంలో 1400 nits వరకు పెంచుకోవచ్చు. ఇది ఫోన్‌లోని అత్యంత ప్రకాశవంతమైన ప్యానల్‌లో ఒకటిగా మారుతుంది. ఒప్పో రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ మరో ప్రత్యేకతను కలిగి ఉంది. అదే ప్రోXDR ఎక్స్‌పోజర్‌ కంట్రోల్‌- ఇది సాధారణ SDR కంటే 8 రెట్లు స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను సర్టుబాటు చేస్తుంది.

oppo reno10 pro plus 5g

రెనో10 ప్రో+ డిజైన్‌ : రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్ కేవలం శక్తివంతమైన ఫోన్‌ మాత్రమే కాదు. అత్యంత తేలికైన, నాణ్యమైన ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. 3D గ్లాస్‌ బ్యాక్‌ ప్యానల్‌తో సక్రమంగా కనెక్ట్‌ చేసేందుకు వీలుగా కర్వడ్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ కేవలం 195 గ్రాముల బరువు, 8.28mm సన్నగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సన్నని మరియు తెలికైన పెరిస్కోప్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

గ్లాస్‌, అల్యూమినియం స్ప్లికింగ్‌ టెక్నాలజీని వినియోగించి తయారుచేసిన టూ టోన్‌ కలర్‌వేను ఈ ఫోన్‌ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ తుప్పు మరియు డ్రాప్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉందని ఒప్పో చెబుతోంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్‌కు రక్షణ కూడా అందిస్తుందని పేర్కొంది.

ఒప్పో రెనో10 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. గ్రోసీ పర్పుల్‌, సిల్వరీ గ్రేలో లభిస్తుంది. ఒకటి సిల్కెన్ గ్లాస్‌ పినిష్‌ను కలిగి ఉండగా, రెండోది మెటాలిక్‌ టెక్చర్‌తో వస్తుంది. మరియు ఫోన్‌కు ఎటువంటి డ్యామేజీ జరగకుండా రక్షించేందుకు వెనుకవైపు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 రక్షణ కలిగి ఉంటుంది.

oppo reno10 pro plus 5g

9 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ : స్మార్ట్‌ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 100W Supervooc ఫాస్ట్‌, సూపర్‌ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ బ్యాటరీ 1-50 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు 9 నిమిషాల 30 సెకన్ల సమయం సరిపోతుంది. మరియు 100 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు 27 నిమిషాల సమయం పడుతుంది. TUV రైన్‌ల్యాండ్‌ పరీక్షల్లోను పాసైంది. 5 నిమిషాలు ఛార్జింగ్‌తో 2 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

ఈ ఛార్జింగ్‌ సిస్టమ్‌కు బ్యాటరీ హెల్త్‌ ఇంజన్‌ (BHE) సహాయం చేస్తుంది. ఇది ఇటీవలే బిజినెస్‌ సస్టైనబిలిటీ 2023 అవార్డును గెలుచుకుంది. దీన్ని ఒప్పో అభివృద్ధి చేసింది. 1600 ఛార్జింగ్‌ సైకిల్స్‌ తర్వాత కూడా 4 సంవత్సరాల పాటు బ్యాటరీ ఆరోగ్యం 80 శాతం వరకు ఉండేలా BHE నిర్ధారణ చేస్తుంది.

supervooc 5 పవర్‌ మేనేజ్‌మెంట్‌ చిప్‌ను ప్రాథమికంగా ఒప్పో అభివృద్ధి చేసింది. ఇందులో 3 చిప్‌లకు బదులుగా ఒక్క చిప్‌ను ఏర్పాటు చేశారు. ఒక్క చిప్‌లో 6 కార్యకలాపాలు ఏకీకృతం చేయబడ్డాయి. డిఛార్జింగ్ తగ్గించడం ద్వారా 45 శాతం పనితీరును మెరుగుపరుస్తుంది.

oppo reno10 pro plus 5g

వేగవంతమైన ఫోన్‌ : ఒప్పో రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ రెనో ఫోన్లలోనే వేగవంతమైన ఫోన్‌గా నిలుస్తుంది. ఇందులో స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ఆధారంగా పనిచేస్తుంది. 4nm TSMCను కలిగి ఉంటుంది. SoC సుమారు 30శాతం పనితీరును మెరుగుపరుస్తుంది. డైనమిక్‌ కంప్యూటింగ్‌ ఇంజిన్‌ సహా ఈ ఫోన్‌ 12GB ర్యామ్‌తో కలిపి ఒకేసారి 44 యాప్‌లు తెరిచి ఉంచవచ్చు.

రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్‌ చేయబడిన ఆల్ట్రా కండక్టివ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది థర్మల్‌ కండక్టవిటీని 1800W/mk వరకు అందిస్తుంది. గేమింగ్‌ లేదా వీడియో షూటింగ్ సమయంలో ఫోన్‌ చల్లగా ఉండేలా కూలింగ్‌ సిస్టమ్‌ చూస్తుంది. పోన్‌ వేడెక్కే అవకాశమే ఉండదు.

oppo reno10 pro plus 5g

కలర్‌ OS 13.1 : ఒప్పో రెనో10 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌OS 13.1 UI ఆధారంగా పనిచేస్తుంది. మల్టీ స్క్రీన్ కనెక్షన్‌ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ OS చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. స్క్రీన్‌షాట్‌ సహా ఇతర ప్రాంతాల్లో సున్నితమైన సమాచారాన్ని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.

మరియు స్మార్ట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫలితంగా మ్యూజిక్‌ సహా ఇతర యాప్‌లను ఫోన్‌ అన్‌లాక్‌ చేయకుండానే తనిఖీ చేయగలదు. రెనో10 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ సూపర్‌ హ్యాండీ ఇన్‌ఫ్రారెడ్‌ రిమోట్‌ కంట్రోల్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఉపయోగించి AC, టీవీ సహా ఇతర గృహ ఉపకరణాలను నియంత్రించవచ్చు.

అత్యాధునిక ఫీచర్లు.. : ఒప్పో రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అత్యాధునిక ఫీచర్లను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. స్మార్ట్‌ఫోన్‌ రంగంలోనే తొలిసారిగా టెలిఫోటో పోర్ట్రెయిట్‌ కెమెరాలు సహా 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. మరియు సూపర్‌ కూలింగ్‌ సిస్టమ్ సహా ఎన్నో అద్బుతమైన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

ఈ ఫోన్‌పై గంటల తరబడి పరీక్షలు నిర్వహించాము. అనేక కెమెరా మాడ్యుల్‌ సహా ఛార్జింగ్‌ సిస్టమ్‌పైనా చాలా సమయం గడిపాము. ఎన్ని యాప్‌లకు మారినా ఒప్పో రెనో10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ నెమ్మదించడం గమనించలేదు. ఈ పనితీరు కంటెంట్‌ క్రియేటర్లు, గేమ్స్‌ ఆడేవారిని బాగా ఆకట్టుకుంటుంది.

ధర, ఆఫర్ల వివరాలు : రెనో10 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా భారత్‌లో విడుదల అయింది. 12GB ర్యామ్+ 256GB వేరియంట్‌ ధర రూ.54,999గా ఉంది. జులై 13 నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో స్టోర్, ఇతర రిటైల్ దుకాణాల ద్వారా అందుబాటులోకి వస్తుంది. రెనో10 ప్రో+ 5G కస్టమర్లు ఈ కింది ఆఫర్లను పొందవచ్చు.

oppo reno10 pro plus 5g
oppo reno10 pro plus 5g

జులై 13 నుంచి 19వ తేదీ మధ్య కొనుగోలు చేసిన వినియోగదారులు MyOPPO లోకి ప్రవేశించి దుబాయ్‌ పర్యటన సహా ఇతర బహుమతులు గెలుచుకోవచ్చు. జులై 13 నుంచి 31 తేదీ మధ్యలో రెనో10ప్రో+, రెనో10 ప్రో 5G ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు రూ.1500 తగ్గింపుతో Oppo Pad Air (4+128GB)ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
First impressions the oppo reno10 pro 5g telephoto camera and performance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X