ఇంటెల్, శాంసంగ్ కలిశాయి.. ఇక రచ్చ రచ్చే

Posted By: Super

ఇంటెల్, శాంసంగ్ కలిశాయి.. ఇక రచ్చ రచ్చే

 

త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'ఇంటెల్ స్మార్ట్‌ఫోన్'ని శాంసంగ్ ప్రమోట్ చేయనుంది. ఆండ్రాయిడ్ వర్సన్‌లో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని సమాచారం. డిజటల్ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ రెండు(ఇంటెల్, శాంసంగ్)తయారీదారులు కలసి వచ్చే సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ ఫోన్‌పై కస్టమర్స్ ఎక్కువ ఆశలను పెట్టుకున్నారు.

ఇటీవల కాలంలో మొబైల్ కస్టమర్స్ గమనించినట్లేతే ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పాటు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్‌ని విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటెల్ సిఈవో సరైన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆటమ్ ప్రాససెర్, ఆండ్రాయిడ్‌తో వచ్చే టెక్నాలజీని 'మెడ్ ఫీల్డ్' గా అభివర్ణించారు. ఇంటెల్ ఇంజనీర్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలసి ఆటమ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యేటటువంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్ రంగంలో హావాని కొనసాగిస్తున్న శాంసంగ్, ఎల్‌జీ, నోకియా, మైక్రోమ్యాక్స్, ఆపిల్ లాంటి ఉత్పత్తులకు ఇంటెల్ గట్టి పోటినిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఇంటెల్ కంపెనీ ఛిప్స్ బిల్డ్‌ని 32nm నుండి 22nmకి తగ్గించే యోచనలో ఉందన్నారు. మార్కెట్లో గట్టి పోటీ ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకొవడం జరిగిందన్నారు. ఇంటెల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న 'మెడ్ ఫీల్డ్' ప్రాససెర్ బ్యాటరీ బ్యాక్ అప్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి శక్తివంతంగా పని చేస్తుందన్నారు.

ఏదీ ఏమైనప్పటికీ ఇంటెల్ ప్రాసెసర్‌తో పాటు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సూపర్ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి ప్రమోట్ ఛాన్స్‌ని శాంసంగ్ కొట్టేసిందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot