ఫస్ట్‌లుక్ ఇరగదీసింది!!

Posted By: Super

ఫస్ట్‌లుక్ ఇరగదీసింది!!

 

సోనీ లోగోతో  రూపుదిద్దుకున్న తొలి స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఎస్’ను  భారీ అంచనాలు మధ్య  ఇండియన్ మార్కెట్లో మంగళవారం లాంఛ్ చేశారు. 2012 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్లేస్టేషన్ గుర్తింపు పొందిన ఈ డివైజ్ ధర రూ.32,549.  4.3 అంగుళాల స్క్రాచ్ రెసిస్టెంట్ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్, 12.1 మెగా పిక్సెల్ కెమెరా, 1.5 గిగాహెర్ట్స్ క్వాల్‌కామ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు :

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఈ వోఎస్ ను ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ కు అప్ గ్రేడ్ చేసే అవకాశముంది),

* 3జీ కనెక్టువిటీ,

* వై-ఫై,

* బ్లూటూత్,

* ఎన్ఎఫ్‌సీ ( NFC).

ఎక్స్‌పీరియా ఎస్ మోడల్‌తో పాటు మరో మూడు మోడళ్లు... ఎక్స్‌పీరియా పి, ఎక్స్‌పీరియా యూ, ఎక్స్‌పీరియా సోలాలను కూడా కంపెనీ విడుదల చేసింది. అయితే, వీటి ధరలను మాత్రం వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot