భారత్‌లోనే తొలి వ్రిస్ట్ ఫోన్: టెక్ బెర్రీ టిబి 007

Posted By: Staff

భారత్‌లోనే తొలి వ్రిస్ట్ ఫోన్: టెక్ బెర్రీ టిబి 007

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల్లో ఓ భాగంగా మారిపోయిన మొబైల్ ఫోన్లు రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీదారులో పెరుగుతున్న పోటీ కారణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. మొబైల్ షాపుకు వెళ్తే వందల కొద్దీ మోడళ్లు. మన అవసరాలు ఏ మొబైల్ సరిపోతుందే ఎంచుకునే లోపే మరో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చేసి మనసుని మార్చేస్తుంటుంది. అలాంటి ఓ అద్భుతమైన మోడల్ గురించే ఈ రోజు మనం చెప్పుకోబుతున్నాం.

మొబైల్ ఫోన్లు, ఎమ్ఐడిలు, పెన్ డ్రైవ్‌లు మెమరీ కార్డులను రూపొందించే సంస్థ వైర్‌లెస్ గాడ్జెట్‌ మ్యానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బ్రాండ్ టెక్‌బెర్రీ దేశీయ మొబైల్ విపణిలోకి ఓ కొత్త మొబైల్‌ను ఆకర్షించింది. చేతిగడియారం మాదిరిగా ఉండే 'టెక్‌‌బెర్రీ టిబి 007' అనే సరికొత్త మొబైల్ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ తరహా మొబైల్ భారత్‌లోనే మొట్టమొదిటిది కావడం విశేషం.

జేమ్స్‌బాండ్ 007ను పేరును తలపిస్తున్న 'టెక్‌బెర్రీ టిబి 007' వ్రిస్ట్ మొబైల్ ఫోన్‌లోని ఫీచర్లు కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటాయి. ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఈ వ్రిస్ట్ ఫోన్‌‌లో ఉంటాయి. 1.5 ఇంచ్‌ల టచ్ స్క్రీన్‌తో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫైబర్‌తో దీన్ని రూపొందించారు. జిపిఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్‌బి పోర్ట్, 500 ఫోన్ బుక్ ఎంట్రీస్, మైక్రో ఎస్‌డి కార్డ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

టెక్‌బెర్రీ టిబి 007 ఫోన్‌లో ఉపయోగించిన స్టాండర్డ్ లిథియం అయాన్ బ్యాటరీ రెండు రోజుల స్టాండ్‌బైను 1.5 గంటల టాక్‌టైమ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంగి. ఇందులో ఉండే 1.3 మెగాపిక్సెల్ కెమరా ద్వారా విజిఏ ఫార్మాట్‌లో వీడియోను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీని ధర రూ. 8,499గా ఉంది.

టెక్‌బెర్రీ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్లు:
ఫుల్ టచ్ స్ట్రీన్ డిస్‌ప్లే
1.3 మెగా పిక్సెల్ కెమరా
వీడియో రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్
మ్యూజిక్ ప్లేయర్
ఎమ్‌పి3
ఎఫ్ఎమ్ రేడియో

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot