ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన 2013 మరిన్ని అద్భుతాలను టెక్ ప్రపంచానికి చూపించనుంది. ఇప్పటికే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్‌టీసీ వన్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్/జెడ్ఎల్, ఎల్‌జి ఆప్టిమజ్ జీ ప్రో వంటి అధిక ముగింపు ఆండ్రాయడ్ ఫోన్‌లు ప్రపంచానికి పరిచయమయ్యాయి.

 

2013కుగాను ఇంకా ఏడు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో చోటుచేసుకోబోయే సరికొత్త ఆండ్రాయిడ్ ఆవిష్కరణలకు సంబంధించి వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

1.) సామ్‌సంగ్ గెలాక్సీ గెలాక్సీ నోట్ 3(Galaxy Note 3):

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న గెలాక్సీ నోట్3 పై భారీ అంచానాలే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద‌తెర కలిగిన ఫోన్లను ఇష్టపడేవారికి గెలాక్సీ నోట్ ఫోన్ ఉత్తమ ఎంపిక. ఈ పెద్దస్ర్కీన్ కలిగిన డివైజ్‌లు కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్‌కు ఉపకరిస్తాయి. గెలాక్సీ నోట్ 2 విషయానికికొస్తే అనేక సౌకర్యాలను ఈ ఫాబ్లెట్ అందిస్తుంది. మొబైలింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా ఆఫీస్ వ్యవహారాలను గెలాక్సీ నోట్2 సంపూర్ణంగా చక్కబెడుతుంది. త్వరలో విడుదల కానున్న గెలాక్సీ నోట్ 3 స్పెసిఫికేషన్‌లకు సంబంధించి నిపుణులు సూచిస్తున్న స్పెసిఫికేషన్‌లు ఇలా ఉన్నాయి.

పెద్దదైన ఆమోల్డ్ డిస్‌ప్లే (1080 పిక్సల్),

పెద్దదైన బ్యాటరీ,
స్నాప్‌డ్రాగెన్ 800 లేదా 8కోర్ ఎక్సినోస్ 5వోక్టా ప్రాసెసర్ (క్లాక్ వేగం 2 గిగాహెట్జ్),
3జీబి ర్యామ్.

 

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!
 

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

2.) ద నెక్స్ట్ నెక్సూస్ (The Next Nexus):

గూగుల్ నెక్స్ట్ నెక్సూస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. గూగుల్ విడుదల చేసే ప్రతీ స్మార్ట్‌ఫోన్ సరికొత్త హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంటుంది. గూగుల్ నెక్స్ట్ నెక్సూస్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జి సంస్థ వృద్ది చేస్తోంది. ఈ నేపధ్యంలో గూగుల్ తరువాతి నెక్సూస్ స్మార్ట్‌ఫోన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గూగుల్ నెక్స్ట్ నెక్సూస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు తెలియాల్సి ఉంది.

 

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

3.) ఎల్‌జి ఆప్టిమజ్ జీ2 (LG Optimus G2):

సామ్‌సంగ్ తరహాలోనే ఎల్‌జి వివిధ వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. ఎల్‌జీ నుంచి ఇటీవల కాలంలో ఆవిష్కరించబడిన ఆప్టిమస్ జీ ఇంకా ఆప్టిమస్ జీ ప్రో ఫోన్‌లు మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎల్‌జీ తరువాతి ఆవిష్కరణ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎల్‌జి నుంచి విడుదల కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జి ఆప్టిమజ్ జీ2' పై మార్కెట్ వర్గాల్లో చర్చసాగుతోంది.

 

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

4.) మోటోరోలో ఎక్స్ ఫోన్ (Motorola X Phone):

గడిచన నవంబర్ నుంచి మోటరోలా ఒక్క స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయలేదు. మోటరోలాను గూగుల్ సొంతం చేసుకున్న నేపధ్యంలో అనేక ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మోటరోలా నుంచి ఎక్స్ ఫోన్ త్వరలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను గూగుల్ ఇంకా మోటరోలా వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ రూమర్‌లలో వాస్తవమున్నట్లయితే మోటరోలా అభిమానులు తమ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆశించవచ్చు.

 

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

ఈ ఏడాది చోటుచేసుకోనున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ సంచలనాలు!

5.) సోనీ ఐ1 (Sony i1):

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో సక్సెస్ కోసం పరితపిస్తున్న బ్రాండ్లలో సోనీ ఒకటి. సోనీ తన ఎక్స్పీరియా సిరీస్ నుంచి అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో కొన్ని విజయవంతం కాగా మరికొన్ని డీలా పడ్డాయి. సోనీ తన పరిధిని మరింత విస్తరింపజేసుకునే క్రమంలో కెమెరా ప్రత్యేకతతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సదరు డివైజ్ పేరు సోనీ ఐ1 (Sony i1). ఈ ఫోన్‌ను తొలిగా అమెరికన్ మార్కెట్లో విడుదల చేయునున్నారు. ఈ పటిష్టమైన ఆండ్రాయిడ్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థతో పాటు 16 లేదా 20 మెగా పిక్సల్ సైబర్ షాట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండనుంది.

 

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X