ఈ ఐదు ఫీచర్‌లతో OPPO Reno13 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఫెర్మామెన్స్ కింగ్‌గా నిలిచింది

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ధర 40k లో అందుబాటులోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు అన్నీ సుమారుగా హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ పైనే దృష్టిసారిస్తుంటాయి. అయితే OPPO మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించింది. ఇటీవల విడుదల అయిన OPPO Reno13 5G ద్వారా అన్నింటా బెస్ట్‌గా ఉండే పనితీరును అందించాలని భావించింది.
ఈ సెగ్మెంట్‌లో మెరుగైన హార్డ్‌వేర్‌తోపాటు Reno13 5G ఫోన్ ద్వారా యూజర్ అనుభూతిని మెరుగుపరచడంపై దృష్టిపెట్టింది. అందుకు అనుగుణంగా ఐదు ముఖ్యమైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఇవి పనితీరును మెరుగుపరుస్తాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూస్తాయి. ఫలితంగా ఈ కేటగిరీలో అద్భుతమైన ఫోన్‌గా నిలుస్తుంది.

AI ఆధారిత కెమెరా యూనిట్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా యూనిట్ మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ OIS, f/1.8 అపేచర్, ఆటోఫోకస్ (AF) సామర్థ్యంతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 115 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ, ఆటోఫోకస్ తో 8MP OVo8D అల్ట్రావైడ్ కెమెరా మరియు 2MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు ముందు వైపు కూడా అద్బుతమైన కెమెరాలను అందించింది. f/2.0 అపేచర్, ఆటోఫోకస్ (AF) సామర్థ్యంతో 50MP శాంసంగ్ JN5 సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
ఈ ఫోన్ లెన్స్‌లు 60 fps వద్ద 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేసే సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ట్రై-మైక్రోఫోన్ ద్వారా సౌండ్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. నేచురల్ లుక్ సహా అత్యంత సహజంగా ఫోటోలు క్యాప్చర్ అయ్యేందుకు AI Soft Light Portrait ఫీచర్ సపోర్టు చేస్తుంది.

దీంతోపాటు Reno13 5G స్మార్ట్‌ఫోన్ అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా విభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్టును కలిగి ఉంటుంది.

* AI Livephoto : ఈ ఫీచర్‌తో 2k అల్ట్రా క్లియర్ లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు. 1.5 సెకన్ల వ్యవధిలో క్యాప్చర్ చేస్తూ ఫ్లాగ్‌షిప్ స్థాయి అనుభూతిని అందిస్తుంది.
* AI Night Portrait : తక్కువ వెలుతురులోనూ స్టన్నింగ్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఫోటోలు అత్యంత సహజంగా ఉండేలా చూస్తుంది.
* AI Clarity Enhancer: ప్రొఫెషనల్ స్థాయిలో 10X జూమింగ్‌తో క్రిస్టల్ క్రియర్‌గా క్యాప్చర్ చేస్తుంది.
* AI Reflection Remover : ఫొటోలోని అనవసర రిఫ్లక్షన్‌ను తొలగిస్తుంది. ఫొటో నేచురల్‌గా ఉండేలా చూస్తుంది.
* AI Eraser 2.0 : ఈ ఫీచర్ ఫొటోలోని అవసరం లేని వస్తువులు, వ్యక్తులను తొలగించేందుకు ఉపయోగపడుతుంది.
* AI Reimage : మీ ఫొటోలను కార్టూన్, క్లాసిక్, పెయింటింగ్‌లుగా మార్చుకొనేందుకు ఈ ఫీచర్ సాయం చేస్తుంది.
* AI Portrait : అనేక గ్రూప్ ఫొటోలను ఒకే ఇమేజ్‌గా మార్చుకొనేందుకు ఈ ఫీచర్ సాయం చేస్తుంది.
* AI Motion : స్టాటిక్ ఫొటోలను లైవ్ ఫొటోలుగా మార్చడంలో ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది.
* AI Unblur : అస్పష్టంగా ఉన్న ఫొటోలను స్పష్టంగా మార్చుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కదులుతున్న వ్యక్తులు లేదా ఇతర వస్తువులను క్యాప్చర్ చేయవచ్చు.
* AI Clear Face : కొన్నిసార్లు ఫొటోలు అద్భుతంగా వచ్చినా.. అందులోని వ్యక్తుల ఫేస్, కళ్లు, హెయిర్ సరిగ్గా క్యాప్చర్ కాదు. అలాంటి సందర్భాల్లో వాటిని సరైన ఆకృతిలో మార్చేందుకు ఈ ఫీచర్ సాయం చేస్తుంది.
* AI Best Face : గ్రూప్ ఫొటోలో కొందరి వ్యక్తులు కళ్లూ మూసి ఉండాయి. అలాంటి ఫొటోలను ఈ ఫీచర్‌తో మెరుగుపరచవచ్చు.
* AI Studio : సాధారణ ఫొటోలను కూడా ఫేంటసీ, వింటేజ్, sci-fi, క్లేమేషన్ థీమ్‌తో అద్భుతమైన ఫొటోలుగా మార్చవచ్చు.
అడ్వాన్స్‌డ్ హార్డ్‌వేర్ మరియు కటింగ్ ఎడ్జ్ AI తో OPPO Reno13 5G ఫోన్ తో క్యాప్చర్ చేసిన ప్రతి ఫొటో అద్భుతంగా ఉంటుంది.
Crafted to captivate. introducing the stunning design of the #OPPOReno13Series #OPPOAIPhone #LiveInTheMoment
— OPPO India (@OPPOIndia) January 6, 2025
Launching on 9th January 2025.
Know more: https://t.co/CQ6etIk4u5 pic.twitter.com/BBo0ESvEra
స్లిమ్, స్ట్రాంగ్, స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్
ఈ OPPO Reno13 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఐవరీ వైట్ సహా భారత్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా లూమినస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. లూమినస్ బ్లూ వేరియంట్ కెమెరా యూనిట్ వద్ద ప్రత్యేకమైన ఎఫెక్ట్‌తో వస్తుంది. అదే ఐవరీ వైట్ యూనిక్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ స్లి్మ్ మరియు తక్కువ బరువును కలిగి ఉంది. లూమినస్ బ్లూ 7.29mm, ఐవరీ వైట్ వేరియంట్ 7.24mm మందంతో ఉంది. బరువు 181 గ్రాములుగా ఉంది.
మెరుగైన అనుభూతిని అందించే విధంగా Reno13 5G స్మార్ట్‌ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 120Hz Smart Adaptive Screen రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 460 PPI అల్ట్రా షార్ప్ పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. ప్రో XDR టెక్నాలజీ, HDR10+ ను సపోర్టు చేస్తుంది. అమెజాన్ HD, HDR, నెట్‌ఫ్లిక్స్ HD, HDR కు అనుకూలంగా ఉంటుంది.
దీంతోపాటు ఈ ఫోన్ డిస్‌ప్లే అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కళ్లకు రక్షణనిస్తాయి. BOE SGS లోబ్లూ లైట్ సర్టిఫికేషన్, 3840 PWM డిమ్మింగ్ వంటి ఫీచర్‌లున్నాయి. చీకట్లు ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో కళ్లకు హాని కలగకుండా రక్షణ కల్పిస్తాయి.
స్లీక్, స్టైలిష్ డిజైన్‌తోపాటు ఈ Reno13 5G స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజుల మన్నిక వచ్చేలా ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. కట్టింగ్ ఎడ్జ్ రక్షణతో ప్రీమియం మెటీరియల్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది. దీంతోపాటు బ్యాక్ ప్యానల్ కూడా ప్రత్యేకమైన రక్షణను కలిగి ఉంది. పొరపాటున జారిపడినా డ్యామేజీ కాకుండా చూస్తుంది. ఈ ఫోన్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను అమర్చారు.

ఆర్మర్ బాడీతో ధృడంగా ఉంటుంది. లోపల భాగాలను డ్యామేజీ కాకుండా చూస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు స్ల్పాష్ నుంచి రక్షణ అందిస్తుంది. గరిష్ఠంగా 2 మీటర్ల నీటిలోతులో 30 నిమిషాల పాటు ఉంచినా ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం లేదు. హై ప్రజర్, హై టెంపరేచర్‌ను కూడా తట్టుకుంటుంది. ఫలితంగా క్లిష్టమైన వాతావరణాల్లోనూ సౌకర్యంగా వినియోగించుకోవచ్చు.

అన్‌స్టాపబుల్ లాగ్ ప్రీ గేమింగ్
Reno13 5G ఫోన్ 4nm MediaTek Dimensity 8350 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన పనితీరును అందిస్తుంది. 4 Cortex A715 ఫెర్మామెన్స్ కోర్స్‌తో కూడిన ఆక్టాకోర్ CPU మరియు 4 Cortex A510 ఎఫీషియన్సీ కోర్స్ గరిష్ఠంగా 3.35GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. స్మూత్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం Mali-G615 GPU చిప్‌సెట్‌ను అమర్చారు. OPPO మరియు MediaTek భాగస్వామ్యంతో ఈ చిప్ ఫ్లాగ్‌షిప్ ఫర్మామెన్స్‌ను అందిస్తుంది. అయితే 15 శాతం గేమింగ్, 10 శాతం 4K రికార్డింగ్ కోసం వినియోగిస్తుంది.
ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, అడ్వాన్స్‌డ్ AI Hyperboost టెక్నాలజీతో జతచేసి ఉంది. మరియు అధునాతమైన కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో మెరుగైన అనుభూతిని అందిస్తుంది. AI ఫ్రేమ్ స్బెబిలైజేషన్ ఫ్రేమ్ రేట్‌ను అవసరం అయిన విధంగా ఉంచుతుంది. ఫలితంగా బ్యాంగ్ బ్యాంగ్ మారథాన్ సెషన్‌లను 60fps వద్ద 8 గంటలపాటు వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ సిగ్నల్ బూస్ట్ చిప్ X1 ను కలిగి ఉంది. ఫలితంగా సిగ్నల్ స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్ గేమింగ్ కోసం అదే X1 చిప్‌సెట్ నెట్‌వర్క్ మెరుగ్గా ఉండేలా చూస్తుంది. వీటితో ఈ ఫోన్ ట్రూ ల్యాగ్ కిల్లర్ గా ఉండనుంది. వీటితోపాటు AI LinkBoost 2.0, TUV Rheinland సర్టిఫికేషన్‌లు స్మూత్, ల్యాగ్ ప్రీ కనెక్షన్‌లను అందిస్తాయి. వీటితో ఈ Reno13 5G ఫోన్ గేమింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌లో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
Ideas, refined. Thoughts, summarized. AI Writer and AI Summary in #OPPOReno13Series make productivity seamless. #LiveInTheMoment #OPPOAIPhone
— OPPO India (@OPPOIndia) January 8, 2025
Know more: https://t.co/CQ6etIjwEx pic.twitter.com/UC31vuOlqS
కస్టమైజేషన్ మరియు స్మార్ట్ AI ప్రొడక్టివిటీ
OPPO Reno13 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. ఈ OS కస్టమైజేషన్ మరియు స్మార్ట్ ప్రొడక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
ఈ OS.. Tap to Share ఫీచర్‌ను కలిగి ఉంది. ఐఫోన్ యూజర్‌లతో AI LivePhoto షేర్ చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది. ఇతర భాషల్లోని కంటెంట్‌ను సులభంగా అనువాదం చేసేందుకు స్క్రీన్ ట్రాన్సిలేటర్, AI Reply, AI Writer, AI Speak, AI enhancements తో పాటు నోట్స్, డాక్యుమెంట్స్ యాప్‌లో AI మెరుగుదలను గుర్తించవచ్చు.
దీంతోపాటు గూగుల్ జెమిని మీ రోజువారీ కార్యక్రమాలను సులభతరం చేస్తుంది. Circle to Search ఫీచర్ మీకు అవసరం అని సమాచారాన్ని క్షణాల్లో పొందేలా చూస్తుంది. దీని వల్ల కచ్చితమైన సమాచారాన్ని వేగంగా పొందే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఫోన్ మీ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ఉంటుంది.

అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
OPPO Reno13 5G హ్యాండ్‌సెట్ 5600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 80W SUPERVOOCTM ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీని ద్వారా 20 నిమిషాల్లో 47 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఫుల్ ఛార్జింగ్ చేసి పూర్తిగా ఒకరోజు మొత్తం వినియోగించుకోవచ్చు.
ఈ ఫోన్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా 5 నిమిషాలు ఛార్జింగ్‌తో 2.4 గంటలపాటు యూట్యూబ్ లేదా 2.3 గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగించుకోవచ్చు. అదే 10 నిమిషాల ఛార్జింగ్ తో 4 గంటలపాటు యూట్యూబ్, 3.7 గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా బ్యాటరీ పైన ఎటువంటి చెడు ప్రభావం చూపదని ఒప్పో తెలిపింది. దీంతోపాటు 5 సంవత్సరాలపాటు మెరుగైన బ్యాటరీ పనితీరు పొందవచ్చు.

అన్నింటా అల్టిమేట్ ఫోన్
ఈ OPPO Reno13 5G స్మార్ట్‌ఫోన్ అల్టిమేట్ ఫెర్మామెన్స్‌ను అందిస్తుంది. 12GB LPDDR5X ర్యామ్ మరియు AI HyperBoost టెక్నాలజీతో గేమింగ్ సహా మల్టీ టాస్కింగ్ లో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అల్ట్రా వాల్యూమ్ మోడ్ మరియు హోలో ఆడియో స్పేషియల్ టెక్తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుంది.
వీటితోపాటు సిగ్నల్‌బూస్ట్ X1 చిప్ మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ColorOS 15 అనేక స్మార్ట్ ప్రొడక్టివిటీ టూల్స్‌ను కలిగి ఉంది. అదే విధంగా 80W SUPERVOOCTM ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీను కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫోన్‌గా OPPO Reno 13 5G ఫోన్ నిలుస్తుంది.

OPPO Reno13 5G ధర వివరాలు
ఈ Reno13 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌తో ఈ ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34199, 256GB స్టోరేజీ వేరియంట్ రూ.35999 గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ OPPO e-Store మరియు Flipkart సహా ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








