ఫ్లాష్..ఫ్లాష్ మరో ఐదు క్రేజీ ప్రాజెక్టులు!

Posted By: Super

ఫ్లాష్..ఫ్లాష్ మరో ఐదు క్రేజీ ప్రాజెక్టులు!

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా మరో ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చెయ్యనుంది. ఈ దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీ నుంచి గత నెలలో విడుదలైన ‘ప్యూర్ వ్యూ 808’ మార్కెట్లో హిట్‌టా‌క్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసింది.

భవిష్యత్ కార్యచరణలో భాగంగా నోకియా ప్రవేశపెట్టబోతున్న ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితా..

బెల్లీ 805,

నోకియా 510,

లూమియా920,

లూమియా 950,

లూమియా 1001.

ఈ వివరాల నోకియా తాజాగా నిర్వహించిన రిమోట్ డివైజ్ యాక్సిస్ (ఆర్ డీఏ) కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి. త్వరలో విడుదల కానున్న నోకియా 510, బెల్లీ 805 ఫోన్‌లు సింబియాన్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. మిగిలిన మూడు ఫోన్‌లు విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. మరో మోడల్ లూమియా 1001 విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

‘నోకియా ప్యూర్ వ్యూ 808’:

నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ప్యూర్ వ్యూ 808’. 41 మెగాపిక్సల్ కెమెరా ప్రధానకర్షణగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2012వేదికగా ఆవిష్కరించారు. ఫోన్ స్లీక్ డిజైనింగ్ అదేవిధంగా స్లిమ్ తత్వం యూజర్‌ను ప్రొఫెషనల్ అనుభూతికి లోను చేస్తుంది. 4 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ పటిష్టతను కలిగి క్వాలిటీతో కూడిన విజువల్స్‌ను విడుదల చేస్తుంది.

ఫోన్ ఇంటర్నల్ మెమెరీ 16జీబి, మెక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. 41 మెగాపిక్సల్ కెమెరా 7152 x 5368పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉత్తమ శ్రేణి ఫోటోగ్రఫీని అందిస్తుంది. పొందుపరిచిన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌ను అందిస్తుంది

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot