మార్కెట్లోకి శాంసంగ్ 'ఫ్లిఫ్' మోడల్

Posted By: Staff

మార్కెట్లోకి శాంసంగ్ 'ఫ్లిఫ్' మోడల్

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఇప్పటి వరకు మనం క్యాండీ బార్, స్లైడ్ బార్, బార్ మోడల్ మొబైల్ ఫోన్స్‌ని చూశాం. ప్రతి మోడల్‌లో కూడా దాని దాని ప్రత్యేకతలు ఉన్నాయి. యూజర్స్ ఉపయోగించేందుకు గాను ఏది అనుకూలంగా ఉంటుందో దానిని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇదే కోవలోకి శాంసంగ్ మరో క్రోత్త మోడల్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దాని పేరు శాంసంగ్ SCHW999. శాంసంగ్ ప్రత్యేకంగా దీనిని ఫ్లిప్ ఫోన్ కేటగిరిలో విడుదల చేస్తుంది.

శాంసంగ్ SCHW999 మొబైల్ ప్రత్యేకతలు:

* Dual screen

* 3.5 inch SuperAMOLED Touchscreen display

* Dual SIM

* 1.2GHz dual core processor

* 5 mega pixel camera

* Bluetooth

* Wi-Fi

* Audio/Video player

శాంసంగ్ SCHW999 మొబైల్ ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే డ్యూయల్ స్క్రీన్స్‌తో పాటు, రెండు డిస్ ప్లే‌లు కూడా 480 x 800 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉన్నాయి. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. డ్యూయల్ సిమ్ ఫీచర్ కలిగిన ఈ మొబైల్‌లో 1.2 GHz డ్యూయల్ కోర్ క్వాలికామ్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి ఈ మొబైల్‌లో అన్నీ ప్రత్యకతలే. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరని ఇంకా వెల్లడించ లేదు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఆడియో, వీడియో ప్లేయర్స్ ప్రత్యేకం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot