72 గంటల పాటు ఓపెన్ సేల్ పై Redmi Note 4

71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'Big Freedom Sale'ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ ఆగష్టు 9న ప్రారంభమై ఆగష్టు 11తో ముగుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

71% వరకు డిస్కౌంట్లు

ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ పై 71% వరకు డిస్కౌంట్లను ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇవ్వనుంది. క్యాష్ బ్యాక్, బుయ్ బ్యాక్ ఆఫర్లతో పాటు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్లను కూడా ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉంచినట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

72 గంటల పాటు ఓపెన్ సేల్ పై Redmi Note 4

ఈ మూడు రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా Redmi Note 4 స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. మూడు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మోటరోలా, లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై డిస్కౌంట్లు..

ఇదే సేల్‌లో భాగంగా మోటరోలా, లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై కూడా ప్రత్యేక ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ సిద్ధంగా ఉంచింది . రూ.9,999 ఖరీదు చేసే లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1000 డిస్కౌంట్‌తో రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశం.

రూ.2,500 తగ్గింపుతో లెనోవో కే5 నోట్

రూ.12,499 ఖరీదు చేసే లెనోవో కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,500 తగ్గింపుతో రూ.9,999కే సొంతం చేసుకునే అవకాశం,

రూ.2,000 తగ్గింపుతో మోటో జీ5 ప్లస్

రూ.16,999 ఖరీదు చేసే మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,000 తగ్గింపుతో రూ.14,999కే సొంతం చేసుకునే అవకాశం,

రూ.48,999కే గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్

రూ.67,000 ఖరీదు చేసే గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ (32జీబి వేరియంట్)ను రూ.48,999కే సొంతం చేసుకునే అవకాశం.

రూ.29,500కే ఐఫోన్ 6

ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ 6 (32జీబి) వర్షన్ రూ.29,500కే లభ్యమవుతుంది. టెలివిజన్ సెట్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, ల్యాప్ టాప్స్, డీఎస్ఎల్ఆర్ కెమెరాస్ అలానే స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీస్ పై ఆసక్తికర డిస్కౌంట్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart announces ‘The Big Freedom Sale’ with best deals. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot