ఐఫోన్ 7 రేటు రూ.20,000 తగ్గింది
ఐఫోన్ 6, 16 జీబి వేరియంట్ పై రూ.26,010 డిస్కౌంట్...
యాపిల్ కంపెనీ ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్లకు తెరలేపుతూ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్ మొదలైంది. మూడు రోజుల పాటు సాగే ఈ సేల్ ఏప్రిల్ 26తో ముగుస్తుంది. ఈ స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా యాపిల్ లేటెస్ట్ వర్షన్ ఐఫోన్‌తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్‌లను యాపిల్ అనౌన్స్ చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..
Read More : రూ.5000కే జియో ల్యాప్‌టాప్

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్
ఈ స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా ఐఫోన్7 256జీబి వేరియంట్ పై ఏకంగా రూ.20,000 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.59,999కే ఐఫోన్7 256జీబి వేరియంట్ మీ సొంతమవుతుంది. సిల్వర్, బ్లాక్, జెట్ బ్లాక్, గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

అదనంగా రూ.19,000 వరకు ఎక్స్‌ఛేంజ్...
రూ.20,000 డిస్కౌంట్ కాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మరో రూ.19,000 వరకు డిస్కౌంట్‌ను పొందే అవకాశాన్ని ఈ సేల్‌లో కల్పిస్తున్నారు. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లకు సంబంధించి ఇతర స్టోరేజ్ వేరియంట్‌ల పైనా డిస్కౌంట్లు సిద్ధంగా ఉన్నాయి.

ఐఫోన్ 6, ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ ఎస్ఈ
ఇదే సేల్‌లో భాగంగా ఐఫోన్ 6, 16 జీబి వేరియంట్‌ను రూ.26,010 డిస్కౌంట్ పోనూ రూ.25,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ కాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మరో రూ.19,000 వరకు డిస్కౌంట్‌ను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు యూజర్లకు అదనంగా 5% డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇదే సేల్‌లో భాగంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ పై రూ.6,000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

యాపిల్ మ్యాక్‌బుక్ రూ.54,990కే..
ఇదే సేల్‌లో భాగంగా యాపిల్ మ్యాక్‌బుక్‌ను రూ.54,990కే సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇదే సేల్‌లో భాగంగా యాపిల్ స్మార్ట్‌వాచ్ పై 35% వరకు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








