Home
Mobile

ఫ్లిప్కార్ట్ లో ఆపిల్ ఫోన్లు, గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! దేని పై ఎంత ఆఫర్, చూడండి?

By Maheswara

ఇండియన్ మార్కెట్లో ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ల కే కాక, ఆపిల్ గాడ్జెట్‌లకు కూడా భారీ గా క్రేజ్ ఉంది. మీరు ఆపిల్ ఐఫోన్ లేదా ఇతర ఆపిల్ గాడ్జెట్‌లని కొనాలని ఆలోచిస్తున్నట్లైతే , ఫ్లిప్కార్ట్ లో ఈ డిస్కౌంట్ ఆఫర్‌ల గురించి తెలుసుకోవడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఐఫోన్‌ల మోడల్‌లు

ఐఫోన్‌ల యొక్క వివిధ మోడల్‌లు (iPhone 11తో సహా) మరియు AirPods వంటి గాడ్జెట్‌లు ఆకర్షణీయమైన తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో గొప్ప తగ్గింపు ఆఫర్లను పొందే కొన్ని ఆపిల్ గాడ్జెట్ల లిస్ట్ మీకు ఇస్తున్నాము.

ఆపిల్ ఐఫోన్ 11

ఆపిల్ ఐఫోన్ 11

ఆపిల్ ఐఫోన్ 11(64GB) స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ ధర రూ. 40,999 గా ఉంది. ఇందులో బేస్ ధరపై 6 శాతం తగ్గింపు ఆఫర్ ఉంటుంది. వినియోగదారులు పరికరం కొనుగోలు పై రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. డిస్కౌంట్ తర్వాత, ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 20,999 కి లభిస్తుంది. వినియోగదారులు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అదనంగా పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 11 యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే,  64 GB స్టోరేజ్, 15.49 cm (6.1 inch) లిక్విడ్ రెటినా HD డిస్ప్లే, డ్యూయల్ 12MP వెనుక కెమెరా మరియు 12MP ఫ్రంట్ కెమెరా. ఇది A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 12 మినీ

ఆపిల్ ఐఫోన్ 12 మినీ

ఆపిల్ ఐఫోన్ 12 మినీ (64GB) బేస్ ధర రూ. 41,999 గా ఉంది. ఇందులో బేస్ ధరపై 29 శాతం తగ్గింపు ఉంటుంది. దీనితో, వినియోగదారులు ఈ ఫోన్ ను రూ. 20,000 ఎక్స్చేంజ్ ప్రయోజనం ద్వారా పొందుతారు. డిస్కౌంట్ ఆఫర్ తర్వాత, ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 21,999 కి లభిస్తుంది. వినియోగదారులు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే బ్యాంక్ డిస్కౌంట్ల ఆఫర్లను కూడా పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 మినీ యొక్క కొన్ని ఫీచర్లను గమనిస్తే 64 GB స్టోరేజ్, 13.54 cm (5.4 inch) సూపర్ రెటినా XDR డిస్ప్లే, డ్యూయల్ 12MP వెనుక కెమెరా మరియు 12MP ఫ్రంట్ కెమెరా. ఇది A14 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఆపిల్ ఎయిర్ పోడ్స్ (2వ తరం)

ఆపిల్ ఎయిర్ పోడ్స్ (2వ తరం)

ఎయిర్ పోడ్స్ (2వ తరం) ధర ప్రస్తుతం రూ. 12,499. Apple నుండి TWS ఇయర్‌బడ్స్‌పై 11 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనిపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు ధర రూ.11,100. అంటే కేవలం రూ.1,399 చెల్లించి ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో

ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో

ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్కార్ట్  ప్లాట్‌ఫారమ్‌పై రూ. 22,500 కి లిస్ట్ చేయబడింది ఇంకా, ఇందులో 14 శాతం తగ్గింపు కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత చివరకు ధర కేవలం రూ. 1,000 మాత్రమే. వినియోగదారులు నిర్దిష్ట బ్యాంకుల కోసం క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్

iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్

Apple సంస్థ తమ ఐఫోన్లు,ఐపాడ్లు మరియు ఇతర ఆపిల్ పరికరాల కోసం iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సరికొత్త అప్డేట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ కు iOS 16.3 గా నామకరణం చేసారు. ఈ కొత్త అప్డేట్ వెర్షన్ లో కొత్త గా తీర్చి దిద్దబడిన లాక్ స్క్రీన్, ఒకే సారి ఎక్కువ సమాచారం కోసం విడ్జెట్‌లు మరియు మెరుగైన శోధన ఫీచర్లతో సహా అనేక కొత్త అప్డేట్ లు మరియు కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఈ OS అప్‌డేట్‌లను అందించాలనే లక్ష్యం లో భాగంగా, ఆపిల్ అధికారికంగా iOS 16.3 అప్‌డేట్‌ను మద్దతు ఉన్న అన్ని పరికరాలకు విడుదల చేసింది. iOS 16.3 తో పాటు కొన్ని కొత్త ఫీచర్లతో పాటు కొన్ని లోపాలను మరియు సెక్యూరిటీ ఫిక్స్‌లను కూడా అప్డేట్ చేసింది. 

Best Mobiles in India

English summary
Flipkart Apple Offers, Huge Discount Offers On Apple Gadgets. Price And Offers Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X