ఆపిల్ ఐఫోన్ల మీద మనసుపడ్డారా,అయితే ఈ భారీ డిస్కౌంట్లు మీకోసమే..

|

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ భారీ డిస్కౌంట్లతో దూసుకొచ్చింది. ఆపిల్‌ వీక్‌ సేల్‌ పేరుతో ఆపిల్ ఐఫోన్ అభిమానుల కోసం సరికొత్త సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్‌ ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. దీంతో పాటే ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్‌, ఎంపిక చేసిన ఆపిల్‌ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, మే 27 వరకు జరుగనుంది. డిస్కౌంట్ పొందిన ఫోన్ల వివరాలు ఇవే.

 

ఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్,రోజుకు 3జిబి డేటాఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్,రోజుకు 3జిబి డేటా

ఐఫోన్‌ ఎక్స్‌

ఐఫోన్‌ ఎక్స్‌

ఆపిల్‌ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ 64జిబి మోడల్ ధర మార్కెట్లో రూ. 89,000గా ఉంది. అయితే దీనిపై నాలుగు వేల తగ్గింపును అందిస్తూ 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. 256జీబీ మోడల్‌ ధర ఐఫోన్‌ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ వస్తోంది.

ఐఫోన్‌ ఎక్స్‌ స్పెషిఫికేషన్లు..
5.8 అంగుళాల సూపర్‌ రెటీనా డిస్‌ప్లే
ఫేస్‌ ఐడీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌
వాటర్‌, డస్ట్‌ రెసిస్టాన్స్‌
12 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
7 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫేస్‌టైమ్‌ హెచ్‌డీ కెమెరా
ఏ11 బయోనిక్‌ ప్రాసెసర్‌

ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8

ఐఫోన్‌ 8 (64జీబీ మోడల్‌) స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్‌ మోడల్‌ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది.

ఐఫోన్‌ 8ను 4.7 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌ కెమెరా, 1080పి హెచ్‌డీ నాణ్యతతో స్లోమోషన్‌ వీడియోలను, 4కే వీడియోలను దీంతో తీయవచ్చు. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం ఉంది.

ఐఫోన్‌ 8 ప్లస్‌
 

ఐఫోన్‌ 8 ప్లస్‌

ఐఫోన్‌ 8 ప్లస్‌ 64జీబీ స్టోరేజ్‌ మోడల్‌ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్‌ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్‌కార్ట్‌ తెలిపింది.
ఐఫోన్‌ 8+ను 5.5 అంగుళాల టచ్ స్క్రీన్, వైడ్‌యాంగిల్‌ లెన్స్‌, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా దీని ప్రత్యేకతలు. ఈ రెండు మోడళ్లూ 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలను వరుసగా రూ.45 వేలు, రూ.51 వేలుగా నిర్ణయించారు. భారత్‌లో మాత్రం ఈ ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్‌ 6ఎస్‌

ఐఫోన్‌ 6ఎస్‌

ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్‌ గ్రే, గోల్డ్‌ కలర్‌ వేరియంట్లు మాత్రమే.ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ రోజ్‌ గోల్డ్‌, సిల్వర్‌ కలర్స్‌ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఐఫోన్‌ ఎస్‌ఈ

ఐఫోన్‌ ఎస్‌ఈ

ఈ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ను 17,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది. ఆపిల్‌ వీక్‌ సేల్‌లో ఇదే బెస్ట్‌ డీల్‌. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తోంది.

ఇతర డీల్స్‌

ఇతర డీల్స్‌

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ విత్‌ మిక్‌ను రూ. 11,499కు విక్రయిస్తోంది. ఆపిల్‌ ఇయర్‌పాడ్స్‌ విత్‌ 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ ప్లగ్‌ వైర్డ్‌ హెడ్‌సెట్‌ విత్‌ మిక్‌ను రూ. 1,899‍
ఆపిల్‌ టీవీ 32 జీబీ మోడల్‌ ఏ 1625ను 14,698 రూపాయలకు,9.7 అంగుళాల ఆపిల్‌ ఐప్యాడ్‌ 32జీబీ మోడల్‌ను 22,900 రూపాయలకు ఆఫర్‌ చేస్తోంది.
9.7 అంగుళాల ఆపిల్‌ ఐప్యాడ్‌(6వ జనరేషన్‌)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటులో ఉంది.
ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ల ప్రారంభ ధర 20,900 రూపాయలుగా ఉంది.

 

 

Best Mobiles in India

English summary
iPhone X, iPhone 7, iPhone SE and MacBooks selling with heavy discounts during Flipkart's Apple Week sale more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X