2016 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై Flipkart భారీ డిస్కౌంట్‌లు

ఈ 2016కుగాను మార్కెట్లో లాంచ్ అయి అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. 'Best of 2016 smartphone sale' పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది.

2016 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై  Flipkart భారీ డిస్కౌంట్‌లు

ఈ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా సిటీబ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్, ఇండస్ ల్యాండ్, స్టాండర్డ్ చార్టర్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లు నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఆఫర్ల వివరాలను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ 7 పై..

ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 7 పై రూ.5,000 ఫ్లాట్
డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అంతే కాకుండా రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కల్పిస్తోంది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా ఐఫోన్ 7 32జీబి వేరియంట్‌ను రూ.55,000కు, ఐఫోన్ 7 128జీబి వేరియంట్‌ను రూ.65,000కు, ఐఫోన్ 7 256జీబి వేరియంట్‌ను రూ.75,000కు సొంతం చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 6 పై

యాపిల్ ఐఫోన్ 6 పై రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అంతే కాకుండా రూ.24,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ను కల్పిస్తోంది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా ఐఫోన్ 6ను రూ.33,900కు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 5ఎస్

ఐఫోన్ 5ఎస్ 16జీబి వేరియంట్‌ను ప్రత్యేక తగ్గింపులో భాగంగా రూ.19,999కి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.అంతే కాకుండా రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కల్పిస్తోంది.

గూగుల్ పిక్సల్

గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్ పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రొవైడ్ చేస్తోంది. అంతేకాకుండా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు గూగుల్ పిక్సల్ ఫోన్ కొనుగోలు పై రూ.8,000 వరుక క్యాష్ బ్యాక్‌ను పొందే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. మార్చి 20, 2017లోపు ఈ క్యాష్ బ్యాక్ అనేది యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. గూగుల పిక్సల్ ఫోన్ 32జీబి వేరియంట్ ధర రూ.57,000. 128జీబి వేరియంట్ ధర రూ.66,000.

Moto X Force

మరోవైపు shatterproof డిస్‌ప్లేతో వస్తోన్న మోటరోలా Moto X Force స్మార్ట్‌ఫోన్ పై రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా Moto X Force 64జీబి వేరియంట్‌ను రూ.29,999కే సొంతం చేసుకునే అవకాశం. అదనంగా రూ.22,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

Nexus 6P Special Edition

గూగుల్ నెక్సుస్ 6పీ స్పెషల్ ఎడిషన్ పై రూ.7,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా Nexus 6P Special Edition స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,998కే పొందే అవకాశం. అదనంగా రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

మోటో జెడ్ ప్లే, మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై

మోటో జెడ్ ప్లే, మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.22,000 వరకు ఎక్స్‌ఛేంజ్ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. మరో ఫోన్ Asus Zenfone 3 Laser పై రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

సామ్‌సంగ్ Galaxy On Nxt

సామ్‌సంగ్ Galaxy On Nxt ఫోన్ పై రూ.1,590 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.16,900కే గెలాక్సీ ఆన్ నెక్స్ట్ ఫోన్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. మరో ఫోన్ గెలాక్సీ జే5 (2016) పై రూ.1300 డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా గెలాక్సీ జే5 ఫోన్‌ను రూ.11,990కే మీరు సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Best of 2016 smartphone sale: Deals on iPhone 7, Google Pixel, Moto X Force. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot