రూ.14999 కే 64MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, వేగాన్ లెదర్ ఫినిష్ 5G స్మార్ట్‌ఫోన్..!
ఇన్ఫినిక్స్ సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ రూ.15 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 64MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు గేమింగ్ సమయంలో 90fps ఫ్రేమ్ రేట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు.
రూ.14999 ధరకే స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ (infinix note 50s 5G+ smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17,999 గా ఉంది.

దీంతోపాటు ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం గ్రే, మిస్టిక్ ప్లమ్, మెరైన్ డ్రిఫ్ట్, బుర్గిండి రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. దీంతోపాటు MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల ఫుల్ HD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ కోసం 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని ఇన్ఫినిక్స్ హామీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ సమయంలో 90fps ఫ్రేమ్ రేట్‌ను సపోర్టు చేస్తుంది.
64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పొలెక్స్ AI అసిస్టెంట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక AI ఫీచర్లను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఛార్జర్‌ను ఉపయోగించి, కేవలం 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








