Home
Mobile

తొలిసారి అత్యంత తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌.. 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌..!

ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ అధిక ధర కారణంగా చాలామంది వెనకడుగు వేస్తుంటారు. పండుగ సీజన్‌ సేల్‌ సమయంలో చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతాయి. ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ కూడా చాలావరకు తగ్గింపు ధరలకు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్ భాగంగా శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy S24 FE Smartphone) అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ఈ ఫోన్ సొంతం. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంది.

samsung galaxy S24 FE Smartphone price on flipkart

రూ.31 వేల డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.30 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.65,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.31 వేల తగ్గింపును పొందవచ్చు.

10 శాతం అదనపు డిస్కౌంట్‌ :
దీంతోపాటు ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే సుమారు రూ.3 వేల వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మింట్‌, గ్రాఫైట్, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

డైనమిక్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ 2x డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

samsung galaxy S24 FE Smartphone price on flipkart

7 సంవత్సరాల వరకు డిస్కౌంట్‌ :
ఈ ఫోన్ 4nm Exynos 2400e ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. ఈ ఫోన్ సర్కిల్‌ టూ సెర్చ్‌, లైవ్‌ ట్రాన్స్‌లేట్‌ వంటి అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లున్నాయి.

టెలిఫోటో లెన్స్‌ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 8MP టెలిఫోటో లెన్స్‌, 12MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. Knox Vault, క్విక్‌ షేర్‌ ఫీచర్లున్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, WiFi 6E, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days 2025 Sale Offers lowest ever price on samsung galaxy S24 FE Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X