ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6 వేల తగ్గింపు.. 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, కర్వడ్ డిస్‌ప్లే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో ఈ సంవత్సరం ప్రారంభంలో పోకో X7 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7 5G, పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా సహా అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో (Flipkart Big Billion Days 2025) భాగంగా పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉండేది.

రూ.6 వేల తగ్గింపు సహా అదనపు డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రారంభ ధర రూ.15,999 గా ఉంది. అదే హైఎండ్ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. అంటే సుమారు రూ.6 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
కర్వడ్ డిస్‌ప్లే :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ (Poco X7 5G Smartphone) 6.67 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ పొందుతుంది.
ఈ డిస్‌ప్లే వెట్ టచ్ డిస్‌ప్లే 2.0 ఫీచర్ సపోర్టును కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. మరియు ఈ డిస్‌ప్లే ఫ్లిక్కర్ ఫ్రీ, Rheinland Low Blue Light సర్టిఫికేషన్‌లతో అందుబాటులో ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో హామీ ఇచ్చింది.
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ AI Photo Editing, AI Notes, AI imaging వంటి AI వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో మరో ఆకట్టుకొనే ఫీచర్ కూడా ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లేసియర్ గ్రీన్, యెల్లో, కాస్మిక్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








