samsung ఫోన్ల పై భారీ ఆఫర్లు! రూ.85 వేల ఫోన్ ఇప్పుడు రూ.55 వేలకే, ఇంకా ఎన్నో ....!
పండుగ సీజన్ త్వరపడనుంది,ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాల పై ఆఫర్లు ప్రకటించడం ప్రారంభించాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ అమ్మకాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ అనేక బ్రాండ్ లకు సంబంధించి వివిధ ఉత్పత్తులపై లాభదాయకమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.

ఎలక్ట్రానిక్స్ విభాగంలో అమ్మకాల సమయంలో మీకు లభించే ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి ఆసక్తి కలిగి ఉంటే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మీకు మరింత డబ్బు ను అదా చేస్తుంది.బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ లతో విక్రయించబోయే ప్రసిద్ధ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మేము సిద్ధం చేసాము.

ఈ అమ్మకంలో భాగంగా, మీరు గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్ లను ఆకర్షణీయమైన ఆఫర్ లతో కొనగలరు. ఈ జాబితాలో గెలాక్సీ A50 లు మరియు గెలాక్సీ A70 లతో సహా కొన్ని గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్‌లను పరిశీలిద్దాం:

Samsung Galaxy S20 Plus
Samsung Galaxy S20 Plus (MRP: Rs. 83,000 , డిస్కౌంట్ తర్వాత ధర రూ.49,999 )
గెలాక్సీ S20+ యొక్క స్పెసిఫికేషన్ లను పరిశీలిస్తే, గెలాక్సీ S20+ , 161.9x73.7x7.8mm కొలతలతో 186 గ్రాముల (5G వేరియంట్ 188 గ్రాముల) బరువును కలిగి ఉంటుంది. ఇది 4,500mAh బ్యాటరీతో వస్తుంది. LTE వెర్షన్‌కు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ తో వస్తుండగా అలాగే 5G వేరియంట్‌కు 12 జిబి ర్యామ్ మరియు 128 జిబి, 256 జిబి, మరియు 512 జిబి స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా కాన్ఫిగరేషన్‌లలో వెనుకవైపు అదనంగా డెప్త్ కెమెరాను చేర్చడం విశేషం. డిస్ప్లే పరంగా ఇది 6.7-అంగుళాల QHD (1,440x3,200 పిక్సెల్స్) డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను అందిస్తుంది. కొన్ని కెమెరా సెన్సార్లు అధికంగా అప్‌గ్రేడ్ చేయబడి ఉన్నాయి. వైడ్-యాంగిల్ మరియు డెప్త్ కెమెరాలతో పాటు మెయిన్ కెమెరా కూడా F/1.8 ఎపర్చరుతో 108 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. అలాగే F/3.5 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటుగా గెలాక్సీ S20+లో సరికొత్త పెరిస్కోప్ తరహా టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇది 10x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ మరియు 100x వరకు ‘సూపర్ రిజల్యూషన్ జూమ్' సాధించడానికి అనుమతిస్తుంది. ముందు సెల్ఫీ కెమెరా కూడా 25 మెగాపిక్సెల్ సెన్సార్, F/2.2 ఎపర్చర్‌తో ఉంటుంది.

Samsung Galaxy A50s
Samsung Galaxy A50s (MRP: Rs. 24,900 , డిస్కౌంట్ తర్వాత ధర రూ.13,999 )
గెలాక్సీ A50s 2019 రెండవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. గెలాక్సీ A50s , 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి + స్క్రీన్‌ను 19.5: 9 నిష్పత్తి మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కలిగి ఉంటుంది. ఇది శామ్సంగ్ యొక్క అంతర్గత ఎక్సినోస్ 9611 చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB / 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు పొడగించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతును కలిగి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 48MP సెన్సార్‌తో వస్తుంది. 8MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ తో సెకండరీ కెమెరా మరియు 5MP డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంటుంది.

Samsung Galaxy A70s
Samsung Galaxy A70s (MRP: Rs. 31,000 , డిస్కౌంట్ తర్వాత ధర రూ.22,999 )
శామ్‌సంగ్ గెలాక్సీ A70s స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత One UI తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్- HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 20: 9 నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ రెషల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC తో రన్ అవుతు 6GB మరియు 8GB RAM ఎంపికలతో జత చేయబడి ఉంటుంది.శామ్‌సంగ్ గెలాక్సీ A70s వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/ 1.8 సెన్సార్ లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ సెన్సార్ తో మూడవ కెమెరా అమర్చబడి ఉంటాయి. అలాగే ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

Samsung Galaxy Note10 Plus
Samsung Galaxy Note10 Plus (MRP: Rs. 85,000 , డిస్కౌంట్ తర్వాత ధర రూ.54,999 )
Samsung Galaxy Note10 Plus ఫోన్ లో 6.8 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్ ఎగ్సినోస్ 9825 ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్ ( 5జీ వేరియెంట్),10 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12+16+12+0.3 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్, 1440x3040 పిక్సల్స్ రిజల్యూషన్, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాంటీ స్పూఫింగ్ ఫీచర్, బ్లూటూత్ ఎస్ పెన్ స్టయిలస్, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్, సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లు ప్రధాన ఆకర్షణలు


Click it and Unblock the Notifications








