Motorola ఫోన్లపై Flipkart భారీ ఆఫర్లు ! లిస్ట్ చూడండి. 

By Maheswara
|

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ పండుగ సీజన్‌లో డిస్కౌంట్లు మరియు ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు, Flipkart కంపెనీ త్వరలో బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను ప్రారంభం చేస్తామని టీజ్ చేయడం ప్రారంభించింది. కానీ ఖచ్చితమైన విక్రయ తేదీలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. పండుగ సీజన్‌కు ముందు అమ్మకం జరుగుతుందని మేము ఊహించినప్పటికీ, అనేక డీల్స్ మరియు ఆఫర్‌లు ఇందులో లభించబోతున్నాయి.

 

Flipkart Big Billion Days Sale 2021 డిస్కౌంట్ లు

Flipkart Big Billion Days Sale 2021 డిస్కౌంట్ లు

ముఖ్యంగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొత్త ఉత్పత్తులు, రష్ అవర్స్, ఫ్లాష్ సేల్ డీల్స్ మరియు క్రేజీ ఆఫర్‌ల ప్రారంభాన్ని సూచిస్తుంది. వినియోగదారులు ప్రతి కొనుగోలుపై రివార్డ్‌లుగా సూపర్ కాయిన్‌లను గెలుచుకోవచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు కొన్ని రివార్డులను గెలుచుకోవడానికి అనుమతించే కొన్ని గేమ్‌లను కూడా ఆడవచ్చు. ఈ అమ్మకం ఇంకా ప్రారంభం కానందున, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లకు సంబంధించి అనేక వివరాలను ఇంకా గోప్యంగా ఉంచింది.

Flipkart ఆఫర్లు మాత్రమే కాక

Flipkart ఆఫర్లు మాత్రమే కాక

Flipkart ఆఫర్లు మాత్రమే కాక, భాగస్వామి ఆఫర్ల విషయానికి వస్తే, ICICI బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించడంపై తక్షణ తగ్గింపు ఉంటుంది. గరిష్ట డిస్కౌంట్ సమీప భవిష్యత్తులో వెల్లడి చేయబడుతుంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వారు చేసే కొనుగోళ్లపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వాలెట్ మరియు UPI చెల్లింపులను ఉపయోగించడంపై Paytm క్యాష్‌బ్యాక్ గురించి కూడా ప్రస్తావించింది.

డిస్కౌంట్‌లో ఉన్న మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు
 

డిస్కౌంట్‌లో ఉన్న మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు

ఫ్లిప్‌కార్ట్ రివీల్ క్యాలెండర్ విభాగాన్ని ముందుకు తెచ్చింది, ఈ బ్రాండ్‌లు తమ ఆఫర్‌లపై డిస్కౌంట్‌లను ఎప్పుడు వెల్లడిస్తాయో చూపుతుంది. అదే విధంగా గమనిస్తే , మోటరోలా అక్టోబర్ 1 న తన ఉత్పత్తుల పై డిస్కౌంట్లను వెల్లడించడానికి సిద్ధంగా ఉంది. అలాగే, ఈ బ్రాండ్ నుండి దేశంలో కొత్త లాంచ్‌లు కూడా అదే రోజున జరుగుతాయి.

ప్రారంభంతో పాటు, మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై లాభదాయకమైన డిస్కౌంట్లు ఉంటాయి. అదే విధంగా ఆఫర్లను గమనిస్తే , అతిపెద్ద తగ్గింపు Moto G60 పై ఉంటుంది. 108MP కెమెరా మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర రూ. 21,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 లో, మీరు దీనిని రూ. 15,999 కు అంటే రూ. 6,000 తగ్గింపు తో మీరు పొందవచ్చు

మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G

మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G

108 MP ప్రైమరీ కెమెరా సెన్సార్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో కూడిన క్వాడ్-కెమెరా మాడ్యూల్‌తో కూడిన మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్ గతంలో రూ. 24,999. ధర వద్ద అమ్ముడవుతున్నది. ఇప్పుడు, దీనిని మీరు రూ. 19,999. కి పొందవచ్చు. అలాగే, పైన పేర్కొన్న ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Moto G40 Fusion

Moto G40 Fusion

అత్యంత సరసమైన మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Moto G40 Fusion స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్ మరియు 120Hz వేగవంతమైన రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర గతంలో రూ. 16,999 ఇప్పుడు తగ్గింపు ధర రూ. 12,999.వద్ద లభిస్తోంది.

Moto Edge 20 5G

Moto Edge 20 5G

Moto Edge 20 5G మొదటిసారి డిస్కౌంట్‌పై లభిస్తుంది. రూ .34,999 ధరతో అమ్ముడయ్యే 144Hz సమోలెడ్ డిస్‌ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 29,999.కే మీ సొంతం చేసుకోవచ్చు.

Motorola Tab 8 లాంచ్

Motorola Tab 8 లాంచ్

ఇప్పటికే, మోటరోలా తమ కొత్త ఉత్పత్తి టాబ్లెట్‌పై పని చేస్తున్నట్లు వివిధ నివేదికలు వచ్చాయి. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 సమయంలో Moto Tab 8 సరైన సమయంలో లాంచ్ చేయబడుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ సమయంలో మోటరోలా లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 1, 2021 న జరుగుతుంది. కానీ, ఇందులో ఏ యే ఉత్పత్తులు లాంచ్ అవుతాయో వివరాలు తెలియవలసిఉంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2021: Huge Discounts On Motorola Smartphones, Check Offers Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X