Home
Mobile

Flipkart Sale 2024 ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (Flipkart Big Billion Days Sale 2024) తేదీలను వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను అందిస్తుంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపునకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్‌, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల సహా ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా లాంచ్‌ అయిన ఉత్పత్తులను కూడా డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 తేదీలు వెల్లడి :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 సెప్టెంబర్‌ 27 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లు సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు UPI ద్వారా చెల్లింపులు నిర్వహిస్తే రూ.50 తగ్గింపును పొందవచ్చు.

Flipkart Big Billion Days Sale 2024 dates announced

ఈ సేల్‌లో భాగంగా నో కాస్ట్ EMI ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరియు ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష వరకు క్రెడిట్‌ సదుపాయం పొందవచ్చని తెలిపింది. బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఈ సేల్‌ ఆఫర్లు, డిస్కౌంట్ల ధరలను వెల్లడించే అవకాశం ఉంది. మరియు ఈ సేల్‌ ద్వారా లాంచ్‌ కానున్న ఉత్పత్తుల జాబితా కూడా వెల్లడి కావాల్సి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఆపిల్‌, శాంసంగ్, వన్‌ప్లస్‌, షియోమీ సహా అతర ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ ప్రారంభం కానుంది.

Big Sale Of Small Things పేరుతో సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు పై 5 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ను కూడా పొందవచ్చు.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ 2024 :
మరో ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ 2024 పేరుతో సేల్‌ నిర్వహించనుంది. అయితే ఇప్పటికీ సేల్ తేదీలను నిర్వహించలేదు. ఈ నెలాఖరు నుంచి లేదా అక్టోబర్‌ తొలిరోజుల్లో సేల్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2024 dates announced here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X