Flipkart Upcoming Sale ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలు లీక్.. పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా కొన్ని లీక్‌లు వచ్చాయి. సాధారంగా ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ లు, టీవీ సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంది. అయితే తాజాగా గూగుల్ సెర్ట్ లిస్టింగ్ ద్వారా ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 (Flipkart Big Billion Days Sale 2024) వివరాలు లీక్ అయ్యాయి.
గూగుల్ సెర్చ్ లిస్టింగ్ ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేట్ సేల్ 2024 తేదీ లీకైంది. దీని ఆధారంగా ఈ సేల్ సెప్టెంబర్ 29 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు సేల్ లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. అయితే ఇతర వినియోగదారులు సెప్టెంబర్ 30 నుంచి సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ సేల్ 7 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అయింది. తొలి 24 గంటలపాటు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 9 నుంచి అందరూ ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. గత సంవత్సరం అక్టోబర్ 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, లైఫ్‌స్టైల్, బ్యూటీ సహా ఇతర ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80 శాతం డిస్కౌంట్‌ను అందించారు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బచత్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఆగస్టు 29 న ప్రారంభం అయింది. సెప్టెంబర్ 5 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా అందిస్తున్న డిస్కౌంట్‌లతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా గరిష్ఠంగా రూ.1,00,000 వరకు క్రెడిట్ లిమిట్‌ను పొందవచ్చు.

బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా అనేక ప్రముఖ బ్రాండ్ ల ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. ఆపిల్, గూగుల్, శాంసంగ్ సహా ఇతర పాపులర్ బ్రాండ్ లను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా సేల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications