50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల FHD డిస్‌ప్లే శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.6000 తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ ను భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 2024 మే నెలలో విడుదల అయింది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.26,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart Big Billion Days Sale 2024) రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్‌తో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ 2024 లో భాగంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.20,999 కే సొంతం చేసుకోవచ్చు. మిగిలిన రెండు వేరియంట్‌లను రూ.23,999, రూ.26,999 కి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ లు :
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F55 5G Smartphone) 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. వేగాన్ లెదర్ డిజైన్‌తో అందుబాటులో ఉంది.
5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. Adreno 644 GPU ప్రాసెసర్ తో జతచేయబడింది. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు వీలుంటుంది. ఆండ్రాయిడ్ 14 OneUI 6.1 OS తో పనిచేస్తుంది. 4 OS అప్‌డేట్ లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

50MP సెల్ఫీ కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాను అమర్చారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌లతో అందుబాటులో ఉంది. Apricot crush మరియు Raisin బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








