Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. ధర రూ.13,499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌..!

పండుగ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ను (vivo Y28s Smartphone Sale) డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ వివో హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌లో (Flipkart Big Billion Days Sale 2024) భాగంగా వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.13,999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. HDFC బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

vivo Y28s Smartphone

వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్ల వివరాలు :
వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ 6.56 HD+ (1612*720) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 269 ppi పిక్సల్‌ డెన్సిటీతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే TUV tuv rheinland certification సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 5G చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది. వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా నైట్‌ మోడ్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌, లైవ్‌ ఫోటో, ప్రో మోడ్‌తో వస్తుంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 15W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు USB-C, స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వింటేజ్‌ రెడ్‌ మరియు ట్విక్లింగ్‌ పర్పుల్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big billion days sale 2024 offers best deal on vivo Y28s Smartphone full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X