Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024..నథింగ్ ఫోన్ 2a, CMF ఫోన్‌1 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 27 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ (Flipkart Big Billion Days Sale 2024) ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లు సెప్టెంబర్ 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు పండుగల సీజన్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్‌లను ప్రకటన చేస్తున్నాయి.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ నథింగ్‌ నుంచి కీలక ప్రకటన వచ్చింది. నథింగ్ సీఈవో Carl pei.. పండుగ సీజన్‌ ఆఫర్లను వెల్లడించారు. నథింగ్‌ ఫోన్ 2a, నథింగ్ సబ్‌బ్రాండ్‌ CMF ఫోన్‌ 1 ను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

nothing phone 2a and cmf phone 1 smartphones deals revealed for Flipkart big billion days sale 2024

ఫ్లిప్‌కార్ట్‌ సేల్.. స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు :
భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a Smartphone) ధర రూ.23,999 కు విడుదల అయింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా CMF ఫోన్‌ 1 భారత్‌లో ధర రూ.15,999 కు విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు మరియు నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని నథింగ్‌ తెలిపింది.

nothing phone 2a and cmf phone 1 smartphones deals revealed for Flipkart big billion days sale 2024

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వరకు జతచేసి ఉంది. భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ 50MP కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

CMF ఫోన్‌ 1 స్మార్ట్‌ఫోన్‌ (CMF Phone 1 Smartphone) 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 పైన పనిచేస్తుంది. 50MP, 2MP కెమెరాను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart big billion days sale 2024 offers huge discounts on nothing phone 2a and cmf phone 1 smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X