ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ 2024..రూ.29,999కి విడుదలైన ఫోన్ రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 (Flipkart Big Billion Days Sale 2024) సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ సహా ఇతర గృహోకరణాలపై భారీ డిస్కౌంట్‌లను అందించనుంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా ఐఫోన్ 15, గూగుల్ పిక్సల్ 8, పోకో F6 స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించాల్సి ఉంది. శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్‌ల వివరాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. ఒప్పో, షియోమీ, ఇన్ఫినిక్స్, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ఆఫర్‌ల వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. అదే నథింగ్ ఫోన్‌లపై డీల్స్‌ను ఈనెల 22 అదే ఐఫోన్‌లపై డిస్కౌంట్‌లను సెప్టెంబర్ 23న వెల్లడించనుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా పోకో F6 5G స్మార్ట్‌ఫోన్‌ను (Poco F6 5G Smartphone) రూ.21999 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లతో ధరకు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో మే నెలలో లాంచ్ అయింది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉండేది.
అయితే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS, ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
ఈ పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ OIS, EIS సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను, సెల్ఫీ, వీడియో కాల్స్‌కోసం 20MP కెమెరాను అమర్చి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.
దీంతోపాటు గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.40,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ రూ.24,999, మోటో ఎడ్జ్ 50 నియో రూ.22,999, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.19,999 గా ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 15 ప్రో మోడళ్లను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. త్వరలో మరిన్ని హ్యాండ్‌సెట్‌ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








