ఫ్లిప్‌కార్ట్ సేల్.. ధర రూ.7499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ. 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 (Flipkart Big Billion Days Sale 2024) ఇవాళ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటన చేసింది. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో M6 5G హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరనే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
పోకో M6 5G స్మార్ట్‌ఫోన్ (Poco M6 5G Smartphone) ప్రస్తుతం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.7499 గా ఉండనుంది. మిగిలిన వేరియంట్‌లు కూడా తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
పోకో M6 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో M6 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ప్రీమియం స్కై డ్యాన్స్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే వీలుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తుంది. 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందనుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా సహా AI కెమెరా, ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ పోకో హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా పోకో M6 5G స్మార్ట్‌ఫోన్ 5G. 4G, WiFi, బ్లూటూత్ V5.3 సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. గెలాస్టిక్ బ్లాక్, ఒరియన్ బ్లూ, Polaris గ్రీన్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








