Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024.. ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్‌ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 (Flipkart Big Billion Days sale 2024) రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లు ఇవాళ్టి నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అనేక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, టీవీ, ఆడియో ఉత్పత్తులు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లపై తగ్గింపు ధరలను పొందవచ్చు. HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 మరియు ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడళ్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15 (iPhone 15 Price Drop) సాధారణ ధర రూ.79,990 ఉండగా.. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.54,999 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.2,750 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 15 ప్లస్‌ (iPhone 15 Plus Flipkart Discount) మోడల్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.61,749 ధరకు కొనుగోలు చేయవచ్చు.

iphone 15 and iphone 15 plus models gets huge discount on Flipkart Big Billion days sale 2024

ఐఫోన్‌ 15 మోడల్‌ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్‌ 15 మోడల్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌, సిరామిక్‌ గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ A16 బయోనిక్‌ చిప్‌పైన పనిచేస్తోంది. 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఐఫోన్‌ 15 మోడల్‌ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలతో తక్కువ వెలుగు ఉన్న సమయాల్లోనూ నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. మరియు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 3349mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 20W ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్‌ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐఫోన్‌ 15 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌ 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఆపిల్‌ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా ప్లస్‌ మోడల్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.6 అపేచర్‌తో 48MP కెమెరా, f/2.4 అపేచర్‌తో 12MP కెమెరాను కలిగి ఉంది. వీటితోపాటు f/1.9 అపేచర్‌తో 12MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లస్‌ మోడల్ 4383mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఐఫోన్ 15 ప్లస్‌ మోడల్‌ 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంది. బ్లూటూత్ 5.3, Wi-Fi 802.11, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌, 5G, 4G, 3G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion days sale 2024 offers massive discounts on iphone 15 and iphone 15 plus models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X