Flipkart Big Billion Days Sale తేదీ వచ్చేసింది ! ఆఫర్ల లిస్ట్ చూడండి.
ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ని అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సేల్ లో రాబోతున్న టాప్ ఆఫర్ల గురించి చూడండి. ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 3 న ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌ని ప్రారంభిస్తోంది. ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ మరియు ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద అన్ని డీల్‌లను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించనప్పటికీ, స్వదేశీ ఇ-కామర్స్ దిగ్గజం సేల్ కింద అందుబాటులో ఉండే కొన్ని అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ డీల్స్ యొక్క వివరాలు అందించింది. మీరు మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ కింద మీరు పరిగణించదగిన కొన్ని మొబైల్ ఆఫర్‌లు ఇక్కడ ఉన్నాయి:

Poco M3
Poco M3 ప్రస్తుతం ధర రూ. 11,999 వద్ద అందుబాటులో ఉంటుంది అమ్మకంలో భాగంగా రూ. 9,499. కి అందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఇది 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది. Poco M3 48 మెగాపిక్సెల్స్ (వైడ్), 2 మెగాపిక్సెల్స్ (మాక్రో) మరియు 2 మెగాపిక్సెల్స్ (డెప్త్) సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6000 mAh బ్యాటరీ ఉంది మరియు ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Oppo A53
Oppo A53 ప్రస్తుతం ధర రూ. 15,990 ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ సేల్ లో తగ్గింపు తో లభిస్తుంది. తగ్గింపు తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 10,990 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంది. Oppo A53 లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

Motorola G60
మోటరోలా జి 60 బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా దాని ప్రస్తుత రిటైల్ ధర రూ. 18,149. కంటే తక్కువగా రూ. 15,999 కి లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో 6GB RAM మరియు 128 GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. మోటరోలా జి 60 లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Micromax IN Note 1
మైక్రోమాక్స్ నుండి IN నోట్ 1 ప్రస్తుతం రిటైల్ ధర రూ. 10,999. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా, ఇది రూ. 9,499 కి ఆఫర్లో లభిస్తుంది. IN నోట్ 1 లో 6.67 అంగుళాల ఫుల్ HD+ IPS ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉంది మరియు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రేర్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. IN నోట్ 1 లో 5000 mAh బ్యాటరీ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా Apple యొక్క iPhone 12, iPhone 12 mini, మరియు iPhone SE కూడా భారీ డిస్కౌంట్‌లను పొందుతాయని భావిస్తున్నారు, అయితే, ఈ డివైజ్‌లపై డిస్కౌంట్ మొత్తం ఇంకా వెల్లడి కాలేదు. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ ఇతర స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిపై డిస్కౌంట్లను అందిస్తుంది. త్వరలో ఈ వివరాలు మీకు అందిస్తాము.


Click it and Unblock the Notifications