Home
Mobile

ధర రూ.14999 కే 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!

దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలతోపాటు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ప్రీమియం నుంచి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ల వరకు భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. తాజాగా మోటోరోలా సంస్థ తన G64 5G హ్యాండ్‌సెట్‌ను (Moto G64 5G Smartphone pricedrop) తగ్గింపు ధరలకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ధరలకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌తోపాటు బ్యాంకు ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌ నడుస్తోంది.

మోటో G65 5G స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ వివరాలు :
మోటో G65 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.16,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్‌ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

moto G64 5G smartphone

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌ 2024 (Flipkart Big Diwali Sale 2024) ఈ నెల 21 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. అయితే అక్టోబర్‌ 20 నుంచే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌లకు ఈ సేల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌ ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటుంది.

మోటో G64 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటో G64 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల పుల్‌ HD+ IPS LCD ను కలిగి ఉంది. ముందు వైపు పంచ్‌ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 20:9 అస్పెక్ట్‌ రేషియోతో అందుబాటులో ఉంది.

6000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 OS ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 సంవత్సరాలపాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

50MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌, ఫేస్‌ డిటెక్షన్‌ ఆటోఫోకస్‌తో 50MP ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా ఈ మోటో G64 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టు్‌ను కలిగి ఉంది. భద్రతా పరంగా సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart big diwali sale 2024 offers best price deal on moto G64 5G smartphone full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X