50MP+ 12MP+ 50MP కెమెరాలు, 256GB స్టోరేజీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు 5G ఫోన్‌పై డిస్కౌంట్..!
ఫ్లిప్‌కార్ట్.. దీపావళీ సందర్భంగా ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళీ సేల్ 2024 (Flipkart Big Diwali Sale 2024) లో భాగంగా అనేక హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరకు అందిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్ 2024 లో భాగంగా షియోమీ 14 CIVI స్మార్ట్‌ఫోన్‌ను (Xiaomi 14 CIVI Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. సివీ స్మార్ట్‌ఫోన్ రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 6.55 అంగుళాల డిస్‌ప్లే, 67W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర :
షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.40,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ రూ.46,999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
షియోమీ 14 సివి 5G స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 446ppi పిక్సెల్ డెన్సిటీ ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 2 రక్షణను కలిగి ఉంటుంది.
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని సంస్థ చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP మరో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ముందువైపు రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 32MP + 32MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ షియోమీ 14 సివీ స్మార్ట్‌ఫోన్ 5G, బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, GPS, NFC, Glonass, Beidou వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ USB-C ఛార్జింగ్ పోర్టుతో పనిచేస్తుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2024 ఎప్పటి వరకు జరగనుంది.. ?
దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్టు ఈ నెల 21 న బిగ్ దీవాళీ సేల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లకు ఈ సేల్ 20 నుంచే అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్ 2024 ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








