ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్ 2024.. ధర రూ.6999 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.
దీపావళీ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ను (Poco C65 Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.6,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. మరియు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తోపాటు బ్యాంకు ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు :
పోకో C65 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ లో 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.7799, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.8499 గా ఉంది. మ్యాటీ బ్లాక్, పాస్టెల్ బ్లూ, పాస్టెల్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
పోకో C65 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
పోకో C65 స్మార్ట్‌ఫోన్ (Poco C65 Smartphone Specifications) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ (1650*720 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.
ప్రాసెసర్, OS వివరాలు :
ఈ పోకో ఎంట్రీ లెవల్ మోడల్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mali G52 MC2 GPU చిప్‌తో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంటుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో C65 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP మ్యాక్రో + AI లెన్స్‌గా పనిచేస్తుంది. మరియు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. అయితే ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో మెరుగైన కెమెరాలను కలిగి ఉన్న ఫోన్‌గా గుర్తింపు పొందింది.
బ్యాటరీ వివరాలు :
పోకో C65 హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్, గూగుల్ మ్యాప్స్‌ను సపోర్టు చేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్ :
దీపావళి సందర్భంగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ (Flipkart Big Diwali sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 21న ప్రారంభం అయింది. ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ దీపావళి సేల్‌లో భాగంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








