Home
Mobile

12GB ర్యామ్‌, 5000MP బ్యాటరీ, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2025 (Flipkart Big Saving Days Sale 2025) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌ ఈనెల 7 వ తేదీన ప్రారంభం అయింది. మార్చి 13 వరకు జరుగుతుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీ, ఇయర్‌బడ్స్‌ సహా ఇతర గృహోపకరణాలను భారీ డిస్కౌంట్‌ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. గత సంవత్సరం జులైలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో మోటోరోలా G85 5G హ్యాండ్‌సెట్‌ (Motorola G85 5G Smartphone Price drop) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే ఈ ఫోన్‌ను రూ.1000 డిస్కౌంట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16999, 12GB ర్యామ్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది.

motorola G85 5G smartphone

దీంతోపాటు బ్యాంకు డిస్కౌంట్‌తో మరింత తగ్గింపును పొందవచ్చు. HDFC బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కోబాల్ట్‌ బ్లూ, ఒలివ్‌ గ్రీన్‌, అర్బన్ గ్రే, వివా మజెంటా కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల (1080*2400 పిక్సల్స్‌) FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేలో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు OIS సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ వీడియోతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

మోటోరోలా హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ Adreno 619 GPU మరియు 12GB ర్యామ్, 256GB స్టోరేజీ తో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 Hello UI ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 802, బ్లూటూత్‌ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌, ఇ-కంపాస్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. IP52 రేటింగ్‌ డస్ట్‌, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్లు, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days sale 2025 offers Rs1000 price drop on motorola G85 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X