Samsung Galaxy S21 Ultra ,S20 Plus ,Note 10 plus ... ఇంకా! ఫోన్ల పై భారీ ఆఫర్లు.

By Maheswara
|

ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా బిగ్ సేవింగ్ డేస్ అమ్మకాన్ని ప్రారంభించింది. ఇక్కడ స్మార్ట్‌ఫోన్ మరియు వాటి ఉపకరణాలతో పాటు ఇతర శ్రేణి వస్తువులు మరియు ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తోంది. ధర తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు నో-కాస్ట్ EMIలు వంటి ఇతర ఆఫర్లతో కంపెనీ వివిధ బ్రాండ్ల నుండి స్మార్ట్ఫోన్లను అందిస్తోంది.ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం సందర్భంగా డిస్కౌంట్‌తో లభించే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను లిస్ట్ తయారు చేసాము.

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో
 

ఇప్పుడు, మీరు అమ్మకం సమయంలో తక్కువ ధరతో కొనుగోలు చేయగలిగే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో, కొత్త తరం గెలాక్సీ S21 సిరీస్ కూడా ఉంది. మీకు ఆసక్తి ఉంటే, ఈ ఫోన్ కొనడానికి ఇది సరైన సమయం. గెలాక్సీ S21 అల్ట్రాను ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌తో పొందవచ్చు. గెలాక్సీ S20 ప్లస్ మరియు గెలాక్సీ నోట్ 10 ప్లస్ వంటి ఇతర ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా మీరు తక్కువ ధరతో మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో భాగంగా గెలాక్సీ A71, గెలాక్సీ A51, గెలాక్సీ A31 స్మార్ట్ ఫోన్లు కూడా ధర తగ్గింపుతో లభిస్తాయి.

Samsung F41 పై 25% ఆఫర్

Samsung F41 పై 25% ఆఫర్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలేడ్ ఇన్ఫినిటీ-U డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 6GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉండి Exynos 9611 SoC చేత శక్తిని పొందుతుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమొరిని 512GB వరకు విస్తరించడానికి ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.శామ్సంగ్ గెలాక్సీ F41 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు లైవ్ ఫోకస్ సపోర్ట్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ మూడవ కెమెరాను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ షూటర్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇస్తూ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Also Read: Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...Also Read: Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...

Samsung Galaxy S21 Ultra
 

Samsung Galaxy S21 Ultra

కొత్తగా విడుదల అయిన ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ (ఇఎంఐ) బ్యాంక్ ఆఫర్‌పేపై రూ.10,000 తక్షణ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌తో ఇప్పుడు రూ.35,100 తక్కువ. క్రెడిట్ కార్డ్, బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ కార్డుపై చెల్లుతుంది. ప్రత్యేక ధర మీద ఎక్స్ట్రా రూ. 23,000 ఆఫర్ ఉంది(డిస్కౌంట్‌తో సహా ధర) భాగస్వామి ఆఫర్‌గెట్ వాచ్ యాక్టివ్ రూ. 990 లేదా శామ్‌సంగ్ బెనిఫిట్ ఇ-వోచర్ రూ. 10,000 మరియు స్మార్ట్ ట్యాగ్ ధర EMI రూ. 9,750 / నెల. ప్రామాణిక EMI కూడా అందుబాటులో ఉంది.

Samsung Galaxy S20 + పై 45% ఆఫర్ ఉంది.

Samsung Galaxy S20 + పై 45% ఆఫర్ ఉంది.

శాంసంగ్ నుంచే మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ S20 + ఫోన్ పైన కూడా భారీ ఆఫర్ ఉంది.ఈ ఫోన్ ప్రస్తుతం ధర రూ.49,999 వద్ద అమ్మబడుతోంది.ఈ ఫోన్ ఫీచర్లు చూడండి.గెలాక్సీ S20+ 161.9x73.7x7.8mm కొలతలతో 186 గ్రాముల (5G వేరియంట్‌ 188 గ్రాముల) బరువును కలిగి ఉంటుంది. ఇది 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది LTE వెర్షన్‌కు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ తో వస్తుండగా అలాగే 5G వేరియంట్‌కు 12 జిబి ర్యామ్ మరియు 128 జిబి, 256 జిబి, మరియు 512 జిబి స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. డిస్ప్లే పరంగా ఇది 6.7-అంగుళాల QHD (1,440x3,200 పిక్సెల్స్) డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను అందిస్తుంది.

Samsung Galaxy Note10 plus ‌పై 35% ఆఫర్

Samsung Galaxy Note10 plus ‌పై 35% ఆఫర్

మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నట్లయితే, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10+ మీకు మంచి ఎంపిక కావొచ్చు. ఈ ఫోన్ Flipkart సేల్ లో ప్రస్తుతం ధర రూ.54,999 మీ సొంతం చేసుకోవచ్చు.ఇక ఈ ఫోన్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లను చూడండి.ఈ పరికరం QHD + రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను 2.5D కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో వస్తుంది.వేరియబుల్ ఎపర్చర్‌తో 12MP ప్రాధమిక కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 16MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 12MP టెలిఫోటో లెన్స్ మరియు 3D టోఫ్ సెన్సార్ కూడా ఉన్నాయి.గెలాక్సీ నోట్ 10+ 20W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది మరియు ఇది IP68 నీరు మరియు ధూళి నిరోధకంగా ధృవీకరించబడింది.ఇది 4500mAh బ్యాటరీ తో వస్తుంది.

Also Read: Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..Also Read: Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..

Samsung A21S పై 16% ఆఫర్

Samsung A21S పై 16% ఆఫర్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 720 X 1,600 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ , ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ తో 8MP సెకండరీ కెమెరా మరియు 2 MP మాక్రో షూటర్, 2MP డెప్త్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ లోపల 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Samsung A51 పై  19% ఆఫర్

Samsung A51 పై  19% ఆఫర్

శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 1080x2400 పిక్సెల్స్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.క్వాడ్-కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Samsung Galaxy A31 పై  25% ఆఫర్

Samsung Galaxy A31 పై  25% ఆఫర్

శామ్సంగ్ గెలాక్సీ A31 లో 6.4-అంగుళాల FHD+ (1,080x2,400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్ ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P65 SoC ఉంది, దీనితో పాటు 6GB RAM మరియు 128GB స్టోరేజీ వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, గెలాక్సీ A31 ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంది.ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Samsung Galaxy A71 పై 21% ఆఫర్.

Samsung Galaxy A71 పై 21% ఆఫర్.

శామ్‌సంగ్ గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ (నానో) సిమ్ స్లాట్ కలిగి ఉండి 6.7-అంగుళాల ఫుల్-HD+ (1080x2400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ఆక్టా-కోర్ SoC మరియు ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ 2.0 తో రన్ అవుతు 8GB RAM తో ఉంటుంది.ఈ ఫోన్ యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా ఉన్నాయి. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days Sale: Huge Offers On Samsung Smartphones.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X