ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024.. నథింగ్ ఫోన్ 2a పై డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024 (Flipkart Big Shopping Utsav 2024 sale) నిర్వహిస్తోంది. అక్టోబర్ 9న ప్రారంభమయిన సేల్.. అక్టోబర్ 13వ తేదీ వరకు జరగనుంది. సేల్‌లో భాగంగా BOB కార్డు, RBL, యెస్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్ కార్డుల ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. నో కాస్ట్ EMI సహా, రూ.1 లక్ష వరకు క్రెడిట్ సదుపాయం, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాలను కూడా వినియోగించుకోవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్‌ను (Nothing Phone 2a Smartphone Price drop) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.22,999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ ధర వివరాలు :
నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.22,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999, 12GB + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.26,999 కే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు :
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a Smartphone) 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని నథింగ్ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వరకు జతచేసి ఉంది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ 50MP కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అందుబాటులో ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టు, స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ గా ఉంది.
నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 ను విడుదల సమయంలో ధర రూ.15999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications