Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. ధర రూ.13299 కే 108MP కెమెరా, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు 5G స్మార్ట్‌ఫోన్‌..!

ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఉత్సవ్ సేల్‌ 2024 ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 13 వరకు ఈ సేల్‌ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్‌ ధరకు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Shopping Utsav 2024 sale) అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రియల్‌మి 11 5G హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం రూ.6000 డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంక్‌ ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరాను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి 11 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 11 5G Smartphone) రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ విడుదల ధర రూ.18,999 ఉండగా ప్రస్తుతం రూ.13,299 కే సొంతం చేసుకోవచ్చు. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను ప్రస్తుతం రూ.13,999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

Realme 11 5G Smartphone

దీంతోపాటు పాత ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.8,150 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. దీంతోపాటు నోకాస్ట్‌ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్రస్తుతం ఈ రియల్‌మి 11 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

రియల్‌మి 11 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి 11 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 11 5G Specifications) 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది.

మీడియాటెక్‌ ప్రాసెసర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ 6100+ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB డైనమిక్‌ ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

108MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి 11 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఉత్సవ్ సేల్‌ 2024 లో భాగంగా RBL, యెస్‌ బ్యాంక్‌, BOB కార్డు, యాక్సెస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. రూ.1 లక్ష వరకు క్రెడిట్‌ సదుపాయం, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌, నో కాస్ట్‌ EMI సదుపాయాలను కూడా వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Shopping Utsav 2024 sale offers massive discount on Realme 11 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X