Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ సేల్..50MP సెల్ఫీ కెమెరా, 256GB స్టోరేజీ 5G ఫోన్‌పై రూ.6000 తగ్గింపు..!!

ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవల బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 నిర్వహించింది. ఇవాళ్టి నుంచి బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ సేల్‌ ను (Flipkart Big Shopping Utsav Sale 2024) ప్రారంభించింది. ఈ సేల్‌ అక్టోబర్‌ 13వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా వాషింగ్ మెషిన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్‌లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఆపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌, ఒప్పో, మోటోరోలా సహా ఇతర బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫ్లి్‌ప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ 2024 సేల్‌లో భాగంగా యాక్సెస్‌ బ్యాంక్‌, BOB కార్డు, RBL, యెస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. రూ.1 లక్ష వరకు క్రెడిట్‌ సదుపాయం ఉంది. మరియు నోకాస్ట్‌ EMI సదుపాయం కూడా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

motorola edge 50 pro 5G Smartphone

ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Pro 5G Smartphone Pricedrop) రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.35999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌తోపాటు మోటో ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ను రూ.21,999, అదే ఎడ్జ్‌ 50 నియో మోడల్‌ను రూ.23,999 కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా మోటో G85 స్మార్ట్‌ఫోన్‌ను రూ.16999, మోటో G45 హ్యాండ్‌సెట్‌ను రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మరిన్ని బ్రాండ్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.35,999గా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ సేల్‌ 2024 లో భాగంగా రూ.6000 డిస్కౌంట్‌తో రూ.29999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే బేస్‌ వేరియంట్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరా, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 120W టర్బోపవర్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big shopping utsav sale 2024 offers RS6000 pricedrop on motorola edge 50 pro 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X