Home
Mobile

Flipkart Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

భారత్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు ఈ సంవత్సరం దసరా, దీపావళి సందర్భాల్లో సేల్ నిర్వహించాయి. అనంతరం కూడా ప్రత్యేక సేల్స్‌ నిర్వహించాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ నిర్వహిస్తోంది. ఈ నెల 23 వ తేదీన ఈ సేల్‌ ప్రారంభం కాగా.. ఇవాళ్టి రాత్రి వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ సేల్‌ లో భాగంగా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్ 2025 లో (Flipkart Black Friday Sale 2025) భాగంగా వివిధ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. గూగుల్‌ ఫోన్‌ లు, ఐఫోన్‌ లు, శాంసంగ్‌ వంటి అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. సేల్‌ ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్ల వివరాలు.

Flipkart Black Friday sale 2025 Offers best deals on flagship smartphones

ఐఫోన్‌ 16 :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ లో భాగంగా ఐఫోన్‌ 16 మోడల్‌ ను (iPhone 16) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లతో రూ.58,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.56,999 ధరకే అందుబాటులోకి వస్తుంది.

గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Google Pixel 10 Smartphone) ప్రారంభ ధర రూ.79999 గా ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.7000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.72999 కే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్‌ (Samsung Galaxy S25 Smartphone) ధర రూ.80999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.10000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.70999 కే సొంతం చేసుకోవచ్చు. ఇవాళ రాత్రి వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్ (Samsung Galaxy S25 FE Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.65999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లి్‌ప్‌కార్ట్‌ లో రూ.31999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గ్రాఫైట్‌, మింట్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Realme GT 7 Pro Smartphone) విడుదల సమయంలో ధర రూ.59,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ లో భాగంగా రూ.48999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రైడే సేల్‌ లో భాగంగా BOBCARD, HSBC, ఫ్లిప్‌కార్డ్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులు, ఫ్లిప్‌కార్ట్‌ SBI బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ లను పొందవచ్చు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ లో ధరలో పెరగడం లేదా తగ్గవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Black Friday sale 2025 Offers best deals on flagship smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X