ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్.. బ్యాంకు ఆఫర్లతో పనిలేకుండా తక్కువ ధరకే ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్..!!
ఐఫోన్ 15 సిరీస్‌ను గత సంవత్సరం భారత్‌లో ఆపిల్ సంస్థ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ రీజన్ సేల్‌లో (Flipkart End of Reason sale 2024) భాగంగా ఐఫోన్ 15 మోడల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ జూన్ 1న ప్రారంభం అయింది. జూన్ 12 వరకు అందుబాటులో ఉంటుంది.
విడుదల సమయంలో ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ 128GB మోడల్ ధర రూ.79,900 గా ఉంది. ఈ ఫ్లి్ప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా 18 శాతం తగ్గింపును కొనుగోలు చేయవచ్చు. అంటే బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా రూ.64,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 మోడల్ (iPhone 15) 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ సహా డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌పైన పనిచేస్తోంది. మరియు iOS 17 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా గత మోడళ్ల కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు తక్కువ వెలుతురు లోనూ నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాలను కలిగి ఉంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3349mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్ లెస్ ఛార్జింగ్‌తో సపోర్టు చేస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ 15 బేస్ మోడల్ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.
ఇప్పటికే ఆపిల్... ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్ 15లో ఈ ఫీచర్ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications