Flipkart Flagship sale ధర రూ.13,999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్.!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024 ను (Flipkart Flagship Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా G64 5G ఫోన్ ను (Motorola G64 5G Smartphone Pricedrop) భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. విడుదల సమయంలో ఉన్న ధరతో పోలిస్తే 22 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో భాగంగా మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.13,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ, HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఐస్ లిలక్, మింట్ గ్రీన్, పెరల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్ప్లే గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
50MP+ 8MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), PDAF (ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్) ఫీచర్‌లు, f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాను మ్యాక్రో లెన్స్ గాను ఉపయోగించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 14 OS :
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
6000mAh భారీ బ్యాటరీ :
మోటోరోలా ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు్‌ను కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది. ఈ మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








