Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్ 2025.. రూ.10 వేల ధర రేంజ్‌లో బెస్ట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌లు.. పూర్తి వివరాలు..!

Flipkart Freedom sale 2025 :స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు భారత్‌ పెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా రూ.10 వేల రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో భాగంగా రూ.10 వేల ధరలో మంచి ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు సేల్‌లో భాగంగా బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఈ జాబితాలో ప్రస్తుతం పోకో M7 5G, ఇన్ఫినిక్స్ హాట్‌ 50 5G, మోటోరోలా G45 5G ఫోన్‌లు ఉన్నాయి.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ :
బడ్జెట్‌ ధరలో పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M7 5G Smartphone) భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది.

5G smartphones under 10k here is the list

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీపైన పనిచేస్తోంది.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9299, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10299 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మింట్‌ గ్రీన్‌, ఓసియన్‌ బ్లూ, శాటిన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

5G smartphones under 10k here is the list

ఇన్ఫినిక్స్ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Infinix Hot 50 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD (1600 x 720 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 48MP సోనీ IMX582 AI డెప్త్‌ సెన్సార్‌తో పాటు మరో కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. మరియు వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌తో అందబాటులో ఉంది.

ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 Soc ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 OS ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,499 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో భాగంగా బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. డ్రీమీ పర్పుల్‌, సేజ్‌ గ్రీన్, స్లీక్‌ బ్లాక్‌, వైబ్రంట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

5G smartphones under 10k here is the list

మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ (Moto G45 5G Smartphone) 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ మోటో ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఒక ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌తోపాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Freedom sale 2025 best 5G smartphones under 10k here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X