రూ.21 వేల ఫోన్‌ను రూ.15000 కే కొనుగోలు చేయవచ్చు.. 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ సహా..!
పోకో సంస్థ ఈ సంవత్సరం జనవరిలో పోకో X7, పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 లో (Flipkart Freedom Sale 2025) భాగంగా పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, OIS, EIS ఫీచర్ల సపోర్టుతో ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు బెస్ట్ వాటర్ ప్రూఫ్ మోడల్‌గా ఉంది.
విడుదల సమయంలో పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ (Poco X7 5G Price drop) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ ను భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

రూ.6000 వేల తగ్గింపు :
ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.15999 గా ఉంది. అంటే రూ.6000 తగ్గింపునకు అందుబాటులో ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. అంటే ఈ వేరియంట్ పైనా రూ.6 వేల తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
4 సంవత్సరాల అప్‌డేట్స్ :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. ఈ పోకో ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గెరెల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, యెల్లో కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

50MP కెమెరా :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
5500mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP66 + IP68 + IP69 రేటింగ్ డస్ట్, బెస్ట్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ AI Imaging, AI Photo Editing AI Notes వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ డిస్‌ప్లే వెట్ టచ్ డిస్‌ప్లే 2.0 ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. మరియు Rheinland Low Blue లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








