Home
Mobile

రూ.10 వేల ధరలో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.. 6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా, డ్యామేజీ కానీ ఫోన్‌..!

Flipkart Freedom sale 2025 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్‌ సేల్ 2025 ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఫోన్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం రూ.10 వేల ధర సెగ్మెంట్లో వివో నుంచి ఇటీవల లాంచ్ అయిన వివో T4 లైట్‌ 5G హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్‌గా ఉంది. బ్యాటరీ, కెమెరా విభాగం పరంగాను ఆకట్టుకుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 lite 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

vivo T4 lite 5G Smartphone pricedrop

దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే ఈ ఫోన్‌ను రూ.9499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో ఈ ఫోన్‌ను బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ టైటానియం గోల్డ్‌, ప్రీజమ్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

చిప్‌సెట్ వివరాలు :
వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది. మైక్రో SD కార్డుతో ఏకంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ :
ఈ వివో బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. మరియు ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

vivo T4 lite 5G Smartphone pricedrop

50MP AI కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Take a Poll

ఈ వివో హ్యాండ్‌సెట్‌ AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Freedom sale 2025 offers rs500 price discount on vivo T4 lite 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X