Home
Mobile

ఈ డీల్‌ అస్సలు మిస్‌ కావద్దు.. ఈ గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌పై ఏకంగా రూ.7000 డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం గూగుల్‌ నుంచి అనేక పిక్సల్‌ ఫోన్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్‌ GOAT సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌ జులై 12 న ప్రారంభం అయింది. 17 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. పిక్సల్‌ 8a ఫోన్‌ విడుదల ధరతో పోలిస్తే ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉండగా.. ఈ సేల్‌లో మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 8a Smartphone) గత సంవత్సరం మే నెలలో భారత్‌లో విడుదల అయింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.52,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది.

Flipkart GOAT sale 2025 phone deals

రూ.7000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లి్ప్‌కార్ట్‌లో ఈ రెండు వేరియంట్స్‌ ధరలు రూ.37,999, రూ.44,999 గా ఉన్నాయి. ఈ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI లావాదేవీలపై ఏకంగా రూ.7000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.

ప్రీమియం డిజైన్ :
పిక్సల్‌ 8a మోడల్‌ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మ్యాటీ బ్యాక్‌ కవర్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ స్క్రాచ్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ పార్సిలియన్, అబ్సిడియన్‌, Aloe, బే వంటి నాలుగు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతోంది. ఈ ఫోన్ 4404mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Flipkart GOAT sale 2025 phone deals

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ Tensor G3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌ కూడా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది. అయితే ఈ ఫోన్‌ కోసం ఏకంగా 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌. 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌లను పొందుతుంది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ అనేక ఫీచర్లను సపోర్టు చేస్తుంది. మేజిక్‌ ఎడిటర్‌, మేజిక్‌ ఎరేజర్‌, అల్ట్రా HDR, ఫొటో అన్‌ బ్లర్‌, ఫేస్‌ అన్‌ బ్లర్‌, లైవ్ HDR+, మోషన్‌ ఆటోఫోకస్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

గూగుల్ పిక్సల్‌ 8a మోడల్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌ 5.3 వంటివి కలిగి ఉన్నాయి. ప్రాక్రిమిటీ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌, గైరో మీటర్, మాగ్నటోమీటర్‌, బారోమీటర్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart GOAT sale 2025 offers best deal on Google Pixel 8a Smartphone, here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X