ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. సుమారు సగం ధరకే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. AI ఫీచర్లు సహా ..!
ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart GOAT Sale) అందరికీ అందుబాటులోకి వచ్చింది. జులై 17 వరకు సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో గెలాక్సీ S24 FE ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే భారీ డిస్కౌంట్ ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో సుమారు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S24 FE) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.35999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.65999 గా ఉండేది.

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో భాగంగా రూ.41999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ గ్రాపైట్, బ్లూ, మింట్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ (2340 x 1080 పిక్సల్స్) డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
శాంసంగ్ చిప్‌సెట్, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ 4nm Exynos 2400e ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 10MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
సర్కిల్ టూ సెర్చ్ :
గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, Live Translation వంటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను కలిగి ఉంది. మరియు వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మరియు 25W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం Knox Vault ను కలిగి ఉంది. క్విక్ షేర్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







