ఐఫోన్ 8 ఖరీదు రూ. 31 వేలేనట !
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో నేటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి.
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో నేటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి.ఆపిల్ తన లేటెస్ట్ మోడల్స్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లకు ఇండియాలో ప్రీబుకింగ్స్ మొదలవగానే ఫ్లిప్‌కార్ట్, జియో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లను వినియోగించుకుంటే ఐఫోన్ 8 31100కే దక్కనుండగా, ఐఫోన్ 8 ప్లస్ 40100కే దక్కనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రెండు ఆఫర్లును వాడుకుంటే ఐఫోన్ 8 ధర ఇంత భారీగా తగ్గుతుంది.

గరిష్ఠంగా రూ.23 వేల వరకు
ఐఫోన్ 8 వేరియంట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ గరిష్ఠంగా రూ.23 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అంటే మీ దగ్గర ఇప్పటికే ఐఫోన్ 7 ఉంటే దానిని ఎక్స్‌చేంజ్ చేసుకున్నందుకుగాను రూ.20 వేల డిస్కౌంట్, ఐఫోన్ 7 ప్లస్‌కు రూ.23 వేల డిస్కౌంట్ వస్తుంది.

పాత ఫోన్ పికప్ చార్జెస్ కింద వంద
దీంతో ఐఫోన్ 8 64 జీబీ ధర రూ.64 వేల నుంచి రూ.41 వేలకు పడిపోతుంది. మీ పాత ఫోన్ పికప్ చార్జెస్ కింద వంద అదనంగా వసూలు చేస్తారు.

మరో పది వేల డిస్కౌంట్
ఇక దీనిపై మరో పది వేల డిస్కౌంట్ అదనంగా లభించే చాన్స్ ఉంటుంది. అదెలాగంటే.. సిటీ క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.10 వేల క్యాష్‌బ్యాక్ వస్తుంది.

సెప్టెంబర్ 29 సాయంత్రం 5.59 నిమిషాలలోపు
ఈ ఆఫర్ సెప్టెంబర్ 29 సాయంత్రం 5.59 నిమిషాలలోపు ప్రిఆర్డర్ చేసుకున్నవారికే ఉంటుంది. క్యాష్‌బ్యాక్ ఈ ఏడాది డిసెంబర్ 30లోపు వచ్చేస్తుంది.

ప్రిఆర్డర్ చేసే ముందు విక్రయదారు పేరు..
అందులోనూ ఫ్లిప్‌కార్ట్‌లో శ్రేయాష్ రీటెయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సెల్లర్ మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నారు. ప్రిఆర్డర్ చేసే ముందు విక్రయదారు పేరు కచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది.

రెండు ఆఫర్లను కలిపితే
ఈ రెండు ఆఫర్లను కలిపితే ఐఫోన్ 8 రూ.31,100కే మీ సొంతమవుతుంది. ఐఫోన్ 8 ప్లస్ రూ.40,100కి వస్తుంది. ఇలాగే 256 జీబీ వేరియంట్ అయితే రూ.44,100, 53,100కి లభిస్తాయి.

గరిష్ఠంగా 12 నెలల వరకైతే
ఇక గరిష్ఠంగా 12 నెలల వరకైతే కొన్ని బ్యాంక్‌ల కార్డులకు నో కాస్ట్ ఈఎంఐలు కూడా అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications